ॐ వినాయక చవితి సందేశాలు
-----------------------
సందేశం - 5
హస్తి ముఖుడు - పాండిత్య ప్రదాత
హస్తిముఖుడు
వినాయకుడు హస్తి ముఖుడు. హస్తమంటే తుండం. హస్తం కలది హస్తి. అంటే ఏనుగు ముఖం కలిగిన వాడు వినాయకుడని భావం.
వినాయకుడు పుట్టిన నక్షత్రం "హస్త". ఆ విషయాన్ని ఈయన ముఖం చూడగానే గుర్తించేలాగా కూడా హస్తిముఖుడయ్యాడు.
శ్రీరామనవమి సమయంలో "పునర్వసు" లాగా,
కృష్ణాష్టమీ సమయంలో "రోహిణీ" నక్షత్రంవలే,
వినాయకుని జన్మ నక్షత్రం "హస్త".
విశేషం
హస్తా నక్షత్రం కన్యారాశికి చెందుతుంది. కన్య అంటే పెళ్ళికానిదని సామాన్య అర్థం. వినాయకునికి వివాహం కాలేదని అంటారు.
సిద్ధి బుద్ధులు ఆయన భార్యలని మరొకచోట చదువుతాం.
సిద్ధి (Spiritual Power), బుద్ధి (Intellect) రెండూ కూడా, జ్ఞానానికి సంబంధించినవిగా అన్వయం.
పాండిత్యం
కన్యారాశికి నవగ్రహాలలో బుధుడు అధిపతి. బుధుడంటే పండితుడని అర్థం.
వినాయకుడు "విద్యల కెల్ల ఒజ్జ" (ఆది పూజ్యుడు) అయ్యాడు. మహా పండితుడు కూడా.
బుధగ్రహ దోషం - నివారణ
బుధగ్రహ దోషం ఉంటే, వారికి
- ధారాళంగి మాట్లాడగలగడం,
- తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలగడం,
- ఉచ్చారణలో శ్రావ్యత స్పష్టత ఉండదని చెబుతారు.
(వాక్పటిమ లోపిస్తుందని అంటారు)
బుధుడు ఆకుపచ్చగా ఉంటాడు. ఎవరికైనా బుధగ్రహం అనుకూలంగా లేకపోతే, నవధాన్యాల్లో ఆకుపచ్చనివైన పెసలని దానం ఇప్పిస్తారు.
ఆకుపచ్చని బుధగ్రహానికి సంబంధించినవాడు వినాయకుడని సూచన ప్రాయంగా గుర్తుచేస్తూ,
ఆకుపచ్చ పత్రితో పూజ ఏర్పాటైంది.
"బుధ" గ్రహ దోషనివృత్తిచేసి, పాండిత్యాన్ని అనుగ్రహించేవాడుగా,
సిద్ధి (Spiritual Power) ,బుద్ధి (Intellect) లతో కూడిన "వినాయకుడు" మన ఆరాధ్య దైవం.
రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి