9, సెప్టెంబర్ 2021, గురువారం

ప్రశ్న పత్రం సంఖ్య: 27

 ప్రశ్న పత్రం సంఖ్య: 27  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

పరికరాలు -ఉపకరణాలకు  సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు  తెలుపండి

  1) స్టౌమీద వేడిగా వున్న అన్నం గిన్నెను దింపటానికి వాడే ఉపకరణం ఏమిటి. 

2) స్క్రూలను బిగించటానికి వాడే పరికరం ఏమిటి 

3) దిక్కులను సూచించేటందుకు వాడే పరికరం పేరు ఏమిటి. 

 4)  కారు మలుపులు తిప్పటానికి దీనిని తిప్పుతారు. 

 5) స్త్రీలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయటానికి వాడే సాధనం పేరు ఏమిటి. 

6) కాగితాల మీద నిర్ణిత పొడవు గీతాలు గీయటానికి వాడే పరికరం. 

7) ద్రవపదార్ధాలను కొలవటానికి దీనిని వాడుతారు. 

8) కూరగాయల బరువు తూకం వేయటానికి వాడే పరికరం.  

9)  పాల చిక్కదనాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు. 

10) రెండు బట్టలను కలిపి ఉంచటానికి కుట్టే చేతి పనిముట్టు ఏమిటి. 

 11) కాగితాలను కలిపి సత్వరం కొట్టటానికి వాడే చేతి సాధనం 

12)  జ్వేరం వచ్చినప్పుడు యెంత టెంపెరచారు వుందో తెలుసుకోవటానికి వాడే పరికరం. 

 13) కూడికలు చేయటానికి చేతిలో పెట్టుకొనే వాడే పరికరం. 

14) హృదయస్పందన తెలుసుకొనేటందుకు వాడే పరికరం.  

15) పొలంలో మడిదున్నటానికి వాడే ఒక వాహనం పేరు చెప్పండి. 

16) మానవ శక్తితో నడిచే ద్విచక్ర వాహనం ఏది. 

17) మీ ఇంట్లో ఫాను తిరగటానికి, ఆపటానికి దేనితో నియంత్రిస్తారు. 

 18)జీర్ణాశయంలో రుగ్మతలను ఈ స్కోపుతో చూస్తారు అది ఏది. 

19) నక్షత్రాలను చూడటానికి వాడే పరికరం పేరు ఏమిటి. 

 20) కంటికి కనపడని సూక్ష్మమైన వాటిని చూడటానికి వాడే పరికరం ఏది. . 


కామెంట్‌లు లేవు: