అనాదిగా మన మహర్షులు భాగవత్తత్త్వాన్ని గూర్చిన అనేక అన్వేషణలు చేశారు. వాళ్ళ జ్ఞాన ఆవిష్కరణాలే ఉపనిషతులు ముండకోపనిషతు లో ఒక రెండు మంత్రాలను పరిశీలిద్దాం. మొదటి ముండకంలో 6వ మంత్రం అక్షర తత్వమైన ఆ పరబ్రమ్మను ఆవిష్కరిస్తుంది గమనించండి.
6. యత్ తదద్రేశ్య మగ్రాహ్య మగోత్రమ్ అవర్ణమ్
అచక్షు: శ్రోత్రం తదపాణిపాదమ్ !
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం
తదవ్యయం యద్ భూతయోనిం పరిపశ్యంతిధీరా: !!
కళ్లు మొదలైన జ్ఞానేంద్రియాలకు గోచరంకానిదీ, చేతులు మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిదీ, ఉత్పత్తిలేనిదీ, రంగు లేనిదీ, కళ్లు చెవులు చేతులు కాళ్లు లేనిదీ, శాశ్వతమైనదీ, అంతటా వ్యాపించినదీ, అత్యంతమూ సూక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనది ఐన ఆ అక్షరతత్త్వాన్ని
జ్ఙానులు సకల జగత్తుకూ మూలంగా అంతటా చూడగలరు.
అక్షర తత్త్వం నుండి ఈ విశ్వం ఎలా ఉత్పన్నమైనదో ఈ మంత్రం తెలియచేస్తుంది.
7. యథోర్ణనాభి: సృజతే గృహ్ణతే చ
యథా పృథివ్యామ్ ఓ షధయ: సంభవంతి !
యథా సత: పురుషాత్ కేశలోమాని
తథా క్షరాత్ సంభవతీహ విశ్వమ్ !!
సాలెపురుగు ఎలా తన గూడును నోటి నుండే వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తాయో, మానవుని తలమీద, శరీరంమీద ఏ ప్రయత్నం లేకనే వెంట్రుకలు ఎలా పెరుగుతాయో అలాగే ఆ అక్షరతత్త్వం నుండి ఈ విశ్వం ఉత్పన్నమౌతుంది.
మన మహర్షులు మనకు ఈ జగత్తుకు సంబందించిన రహస్యాలను ఛేదించి మనకు అందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి