🌹భగవద్గీత🌹
పదమూడవ అధ్యాయము
క్షేత్ర - క్షేత్రజ్ఞవిభాగయోగము
నుంచి 32వ శ్లోకము
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ౹
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ౹(32)
యథా , సర్వగతమ్ , సౌక్ష్మ్యాత్ ,
ఆకాశమ్ , న , ఉపలిప్యతే ౹
సర్వత్రా , అవస్థితః , దేహే , తథా ,
ఆత్మా , న , ఉపలిప్యతే ౹౹(32)
యథా = ఏవిధముగా
సర్వగతమ్ = సర్వత్ర వ్యాపించిన
ఆకాశమ్ = ఆకాశము
సౌక్ష్మ్యాత్ = సూక్ష్మమగుటవలన
న , ఉపలిప్యతే = గుణదోషములచే లిప్తము కాదో
తథా = అట్లే
దేహే = దేహమునందు
సర్వత్ర , అవస్థితః = అంతటను వ్యాపించియున్నను
ఆత్మా = ఆత్మ (నిర్గుణమగుటచే)
న , ఉపలిప్యతే = దేహముయొక్క గుణములతో లిప్తము కాదు
తాత్పర్యము:- సర్వత్ర (ఇతరమహాభూతములయందు) వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకలప్రాణుల దేహముయందు స్థితమైయున్నను ఆత్మనిర్గుణమగుటవలన వాటిగుణదోషములు దాని కంటవు. (32)
ఆత్మీయులందరికి శుభ శుభోదయం
Yours Welwisher
Yennapusa Bhagya Lakshmi Reddy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి