29, ఏప్రిల్ 2022, శుక్రవారం

బ్రాహ్మణ సమాజానికి

 బ్రాహ్మణ సమాజానికి నమస్కారములతో.


చలో  విజయవాడ. మే 1.ఆదివారం.

బ్రాహ్మణ మేధోమదన సదస్సు.

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య.209/1984.


★స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయుల ఆత్మగౌరవం కోసం దన,మాన ప్రాణాలను పణంగా పెట్టిన, కోల్పోయిన జాతి... బ్రాహ్మణ జాతి.


★భారత రాజ్యాంగ నిర్మాణంలోని  సభ్యులలో  కీలక పాత్ర పోషించిన మహనీయులు బ్రాహ్మణలే.భారత రాజ్యాంగం డ్రాఫ్ట్ కాపీ దాదాపు 60 దేశాలు తిరిగి స్వయంగా తయారు చేసిన శ్రీ బెంగాలు నరసింగరావు కూడా బ్రాహ్మణుడే.


★ఆర్ధిక సంస్కరణలు యోధుడు పివి గారు బ్రాహ్మణుడే..


★నిరుపేద దళిత జాతి అభివృద్ధి కోసం  ఎటువంటి అధికారం లేకుండా అగ్రవర్ణ భూస్వాముల వద్ద భూములను దానంగా స్వీకరించి దేశ వ్యాప్తంగా భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కూడా బ్రాహ్మణుడే ...వినోభా భావే.


★దళితులను అంటరాని వారుగా గుర్తించి,దేవాలయాలకు రానివ్వని సందర్భంలో,దళితులకు దేవాలయ ప్రవేశం చేయించిన భారత రత్న అవార్డు గ్రహీత మదన్ మోహన్ మాలవ్యా కూడా బ్రాహ్మణుడే .


★బ్రిటిష్ తుపాలకులకు ఎదురొడ్డి నిలిచి, రాష్ట్ర రాజకీయాలలో మొదటగా దళితుడైన దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రి చేసింది బ్రాహ్మణుడే....ఆంద్ర కేసరి.టంగుటూరి ప్రకాశం పంతులు గారు.

ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న బ్రాహ్మణ జాతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  అండగా ఉండాల్సిన  పరిస్థితులలో  మనువాదపు ముద్ర తోటి మన బతుకులు అనగతొక్కి రాజకీయక్రిడలో పావులుగా మార్చుతున్న ఈ వ్యవస్థను ప్రశ్నించేందుకు...సామాజిక న్యాయం లో దక్కని వాటాను నిలదీసి ఆడిగేందుకు కులమే బలమైన నేటి ప్రజాస్వామ్య క్షేత్రంలో  బ్రాహ్మణ సత్తాను చాటి బ్రాహ్మణ జాతి పూర్వ వైభవాన్ని జన హితమే లక్ష్యంగా.. జాతి ప్రగతి ద్యేయంగా  త్వరలో జరగబోవు బ్రహ్మ గర్జన సభను విజయవంతం చేయుటకు నిర్వహిస్తున్న బ్రాహ్మణ మేధోమదన సదస్సు (రౌండ్ టేబుల్ ) సమావేశంను బ్రాహ్మణ జాతి అభ్యుదయాన్ని,శ్రేయస్సును కోరుకునే ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాము.

మే 1 వ తేదీ ఆదివారం హోటల్ ఐలాపురం  విజయవాడ 


నమస్కారములతో.

మాచిరాజు రవికుమార్

సత్యవాడ దుర్గాప్రసాద్.

కోనూరు సతీష్ శర్మ.

H. k మనోహర్ రావు.

కామెంట్‌లు లేవు: