29, ఏప్రిల్ 2022, శుక్రవారం

సూర్యగ్రహణము

 _*సూర్యగ్రహణము భారతదేశములో కనిపిస్తుందా?*_ 


ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్‌ (April) 30, 2022న ఏర్పడనుంది.

ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం ఎక్కడ..? ఏ సమయంలో ఎలా కనిపించనుందనే వివరాలు.


 ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో మూడు రోజుల్లో ఏర్పడనుంది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం. దక్షిణ అమెరికాలోని దక్షిణాధి ప్రజలు, అంటార్కికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు ఏప్రిల్‌ 30న సూర్యాస్తమయానికి కొద్దిముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. 

ఇక చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్‌ దేశాలలో అకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యాస్తమయం సమయంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.


 అయితే 

*భారతదేశంలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదు.* 


దక్షిణ, అమెరికాలోని సౌత్‌ ఈస్టర్న్‌ ప్రాంతాల్లో, దక్షిణ పసిపిక్‌ మహా సముద్ర ప్రాంతాల వాసులకు ఈ సూర్యగ్రహణం కనిపించనుంది.


*గ్రహణం కనిపించని ప్రాంతాలలోని వారు ఎటువంటి నియమాలను పాటించనవసరం లేదు.*

కామెంట్‌లు లేవు: