ॐ శంకర జయంతి ప్రత్యేకం - 1
(మే 6వ తేదీ వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి)
మన దేశ స్వరూప స్వభావాలు రోజురోజుకీ మారిపోతున్న ఈ పరిస్థితులలో, జగద్గురు ఆది శంకరులు చూపిన బాట అన్ని విషయాలలోనూ, ఎప్పటికీ అందరికీ అనుసరణీయం.
అది సర్వులూ వ్యక్తిగతంగానూ, సమాజపరంగానూ అవలంబించి, పరమేశ్వరుని తెలుసుకొని అనుభూతి పొందే విధానం. దానిలో,
1. అవతారం - ఆవశ్యకత
2. శంకరుల కాలం
3. జాతీయ సమైగ్రత
4. సాంఘిక దురాచారం - అస్పృశ్యత
5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం
6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు
7. వివిధ స్తోత్రాలు
8. అద్వైత సిద్ధాన్తమ్
9. మహావాక్య చతుష్టయము
(నాలుగు మహా వాక్యాలు) వంటి విషయాలపై,
ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయమై తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
అవి పరిశీలిస్తే,
గత కాలమాన పరిస్థితులలో మాత్రమే కాక,
ఏ కాలంలో నైనా,
ఏ పరిస్థితులలోనైనా, సర్వమానవాళి సుఖశాంతులతో జీవిస్తూ, తమలోని దైవాన్ని గుర్తించి, తాము బ్రహ్మస్వరూపంగా మారి, జీవన్ముక్తి పొందేవిధంగా ఆదిశంకరులు దేశాన్ని తీర్చిదిద్దారని అవగతమవుతుంది.
ఆ జగద్గురువులు అందించిన సామాజిక, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపదలను కులమతాలకతీతంగా భారతీయులంతా గ్రహించి, ఆచరిస్తూ, వసుధైక కుటుంబంగా అందరినీ ఈ విధానంలోనికి తీసుకురావాలి.
తద్వారా ప్రపంచశాంతికి మార్గం సుగమం చేయవలసిన బాధ్యత - కర్మభూమిలో పుట్టిన మనందరిదీ!
దానికై కృషిచేస్తూ,ఆదిశంకరుల చేత పునరుద్ధరింపబడి, మనవరకూ పెద్దలు అందించిన వైదిక జ్ఞానసంపద తరువాతి తరాలకి అందిద్దాం. అదే జగద్గురువులకు మనం అందించే గురుదక్షిణ.
జయజయ శంకర హరహర శంకర
=x=x=x=
— రామాయణం శర్మగా పిలవబడే
బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి