ॐ ఆషాఢ మాసం - ప్రత్యేకత - VII
ॐ కొత్త దంపతులు
ఆషాఢ మాసంలో కొత్త కోడలూ, కొత్త అల్లుడూ వారివారి అత్తిళ్ళ గడపలు దాటకూడదు అంటారు.
దీని అసలు కారణాలు వెనక్కి వెళ్ళిపోయి, గడపలు దాటకుండా, మిగతా వ్యవహారాలు మాత్రం సాగిపోతున్నాయి.
ఈ ఆచారానికి అసలు కారణాలు
1. మనది ప్రధానంగా వ్యావసాయక దేశం. ఆషాఢ మాసం ప్రారంభంనుంచీ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి.
కాబట్టి వాటిమీద దృష్టి పెట్టాలి.
2. నూతన దంపతులు ఆషాఢ మాసంలో కలిసి, స్త్రీ గర్భవతి అయితే, పురుడు వేసవి మధ్య కాలంలో వస్తుంది. స్త్రీకి మొదటి కానుపుకు ఆకాలం అనుకూలం కాదు.
అందుకనే దంపతులని ఆ నెల దూరంగా ఉంచడం.
కొద్దిరోజుల దూరం మరింత దగ్గరచేస్తుంది కూడా కదా!
3. అత్తింటి దగ్గర కొత్త కోడలుగా ఉండి, పుట్టింటికి వచ్చిన అమ్మాయి, అత్తింటి - పుట్టింటి ఆచార వ్యవహారాలవంటివన్నీ తల్లిదండ్రులతో చెప్పుకుంటూ, సమన్వయ పరచుకునే వెసులుబాటు ఆషాఢమాసం వలనే.
(ప్రస్తుత residential విద్యా సంస్థల్లో, చేరిన పిల్లలకి మొదట్లో home sick అని సెలవులిస్తారు కదా!)
పెద్దలు ఎంతో ఆలోచించి, మన శ్రేయస్సుకై అందిచ్చిన ఆచారాలను, యథాతథంగా కొనసాగించాలి కదా!
సమాప్తం
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి