అరటిపండు
అరటిపండుగురించి తెలియని వారు అరటిపండు రుచి తెలియని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి శిశుదశ నుండి వృద్ధాప్యం వరకు అనేక పరియాయలు అరటిపండ్లు తిన్నవారే అందరు. బుద్ది వికసించని శిశువులకు ఇస్తే అరటి పండును తినటం తెలియకపోవచ్చు కానీ ఏ మాత్రం వయస్సు వున్న బాలునికి అరటిపండు ఇచ్చినా వెంటనే తోలు తీసి గుజ్జు తినటం పరిపాటి. ఏదైనా విషయాన్నీ సందేహరహితంగా వివరిస్తే అరటి పండు వలచి పెట్టినట్లు చెప్పానుకదా అని అనటం పరిపాటి. అంటే అరటి పండు వలచినతరువాత పండు తినటం చాలా సులువు అని కదా అర్ధం.
ఇక విషయానికి వస్తే సాధకుడు నిత్యా నిత్య వివేకం చేయటం అరటిపండు వలచినంత మాత్రంగా జ్ఞ్యానులు పేర్కొంటున్నారు. వివరణలోకి వస్తే అరటిపండు చూడటానికి చాలా ఇంపుగా పండు చూస్తేనే తినబుద్ది అయేటట్లు ఉంటుంది. నిజానికి దాని తోలు కంటికి ఇంపుగా ఉన్నాకూడా అది మనం తినం దానిని వలచి వేస్తేనే మనం తినే పండు లభిస్తుంది.
విషయవాసనలు చూడటానికి అరటిపండు తోలులాగా నేత్రానందంగా వున్నా అది కేవలం తీసి పారవేసేది అని యెట్లా తెలుసుకుంటామో అదే విధంగా మనం ఈ జగత్తులోని విషయవాసనాలను తీసి వెర్సి నిత్యం సత్యం అయినా పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి. అదే బ్రహ్మ జ్ఞ్యాననఁ ప్రతి మానవుడు జీవితంలో సాధించవలసిన ఏకైక జీవన లక్ష్యం. సాధకుడు సదా దానికోసమే, దానివెంట పరుగులిడి తన జన్మను సార్ధకత చేసుకోవాలి.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి