సౌందర్యలహరి- 22 - “భాస్కర ప్రియ”
సౌందర్యలహరి- 22
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంచన్కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్ || 22
తల్లీ, భవాని! నేను నీ దాసుణ్ణి, నీ కృపా కటాక్ష వీక్షణం నాపై ప్రసరింపజేయుము అని ఉపాసకుడు ప్రార్థించినంతనే, అతడికి, ముకుందబ్రహ్మేంద్రులు తమ రత్నకిరీటాలచేత నీరాజనం గావించబడే నీ పాదపద్మాల యొక్క సాయుజ్యాన్ని కల్పిస్తున్నావు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
భాస్కర ప్రియ (భాస్కరానందనాథ భావము)
చాలా అత్భుతమైన శ్లోకము. ఆచార్యులు వారు మనకు దేవతార్చనలో నిత్యం చదువుకొనేదానికి ఇచ్చిన గొప్ప శ్లోకము ఇది. ఆత్మార్పణము అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి అనేది మనకు ఈ శ్లోకము ద్వారా నేర్పిస్తున్నారు.
భవాని త్వం.... భవానీ నీవు ....అని అనీ అనే లోపల అమ్మ మనకు మోక్షం ఇచ్చేస్తుంది అట. అది ఎలాగో చూస్తాము.
భవానిత్వం అంటే మోక్షత్వం. భా అంటే ప్రకాశించునది. కాంతివంత మైనది. శుద్ధ తత్త్వం లోనే, సత్వ గుణం తోనే ఆత్మ ప్రకాశిస్తూ వుంటుంది. సదా ప్రకాశిస్తూ ఉండడమే మోక్షత్వం లో వుండడం. భవానిత్వం అంటే మోక్షత్వం, మోక్షత్వం అంటే ప్రకాశించడం అని అర్ధం. కర్మలు లేకుండా వుండడటమే ప్రకాశించడము.
మోక్షం దేని నుంచి అంటే కర్మ నుంచి. కర్మ నుంచి విముక్తి పొందడమే మోక్షం. కర్మలు లేకుండా ఉండడమే కైవల్యము.
భ అంటే భవము. అంటే సంసారము. సంసారము నుంచి విముక్తి ప్రసాదించేది గనుక భవాని.
భవస్య పత్నీ భవానీ, భవుని భార్య భవాని.
భవతి భవతేవా సర్వమితి భవః.....అంతయూ తానైన వాడు. అంతయూ నిండిన వాడు. భవుడు అంటే శివుడు. మహాదేవుడు.
భవము అంటే పుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము అని కూ
ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు తెలంగాణ బ్రాహ్మణ సే�
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి