24, జూన్ 2023, శనివారం

 వాట్సప్ లో వచ్చిన తప్పులన్నీ పునరావృతమౌతున్నాయి. సరే అది అటు ఉంచుదాం. వరరుచి సిధ్ధాంతకౌముది-అనేవ్యాకరణంలో వార్తికకారుడు.

చక్కని సంస్కృత పరిణతికలవాడు.అతడు అర్ధాలకోసం దేశాలు పట్టుకుతిరగటం.విక్రమార్కుడు.ఇవన్నీ కట్టు కథలు.

     అసలాశ్లోకానికి 18 అర్ధాలున్నాయా?పండితులతో చర్చించటం జరిగింది.

  1రామాయణపరంగా-

హేతాత!-ఓనాయనా! 

రామం-రాముని,

దశరథంవిధ్ధి-దశరధుడనుకో,

జనకాత్మజాం-జానకిని

మాం విధ్ధి-నేననుకో

అటవీం- అడవిని

అయోధ్యాం విధ్ధి-అయోధ్యయనుకో

యధాసుఖమ్-సంతోషంగా ,

గఛ్ఛ-పోయిరా,

నాయనా లక్మణా!రాముడు మీనాన్నే అనుకో,సీతను మీయమ్మేఅనుకో,అడవే అయోధ్యయనుకో , ఉత్సాహంగాపోయిరా!

అని రామాయణకధాపరంగా అర్ధం.

   ఇదిగాక,

రామందశరథంవిధ్ధి-రాముని విష్ణువనుకో.

    జనకాత్మజను మాం లక్ష్మి అనిభావించు.

అని వారియవతారస్వరూపములను తెలియజెప్పుట

రెండవయర్ధము.

      ఇంతకు మించి కృతకముగా అర్థప్రకల్పనమొనరింపయోగ్యముగాదు.కావున పైపోస్టులోని 18 అర్థములనుమాట పొసగదు.🙏🙏

కామెంట్‌లు లేవు: