నిత్యాన్వేషణ:
రామునికి గల 16 సద్గుణాలు ఏవి?
యుక్త వయసు అమ్మాయిల్ని అందరు దీవించే మాట నీకు రాముడు లాంటి భర్త రావాలి అని..
మన హిందూ పురాణాల్లో అనేకమంది దేవుళ్ళు దేవతా మూర్తులు వున్నారు, కానీ రాముడి లాంటి భర్త రావాలి అని రాముడితో పోల్చడానికి కారణం లేకపోలేదు..
తల్లిదండ్రుల మాటను తచ తప్పక పాటించడం, సోదరులను అత్యంత ఆదరంగా చూడటం, తన భార్యను అత్యంత ప్రేమించడం, తన పాలనలో ప్రజలను తన కన్న బిడ్డల్లా చూడటం, వారికి ఎటువంటి కష్టాలు లేకుండా పాలించడం; దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతదూరమైనా వెళ్ళటం వంటి సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి; స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం వంటి దుర్గుణాలు లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. కానీ విలువలకు పట్టం కట్టే మన సనాతన భారతదేశంలో ఈ అన్ని గుణాలు కలిగిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. కానీ వారందరికీ ఆదర్శం నాటి శ్రీరాముడు.
ఒకానొక సందర్భంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని ‘ఈ భూమిలో ఈ క్రింది 16 లక్షణాలు లేక సద్గుణాలు కల్గిన ఆదర్శపురుషుడు ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. ఆ 16 సద్గుణాలు ఇవి :
గుణవంతుడు
వీర్యవంతుడు (ధైర్యవంతుడు)
ధర్మం కలవాడు
కృతజ్ఞత కలవాడు
సత్యాన్ని పలికేవాడు
దృఢవ్రతుడు (శక్తివంతుడు)
చరిత్రను లిఖింపగల యోధుడు
సర్వప్రాణుల హితం కొరుకునేవాడు
విద్వాంసుడు (పండితుడు)
సమర్ధుడు (ప్రావీణుడు)
ఆత్మను ధర్మించేవాడు
జితక్రోధుడు (అందరిని కలిపే గుణం)
ద్యుతిమాన్
అసూయ లేనివాడు
వాస్తవాన్ని గ్రహించేవాడు
యుద్ధ రంగంలో మూర్తీభవించిన ఆగ్రహం కలవాడు.
వాల్మీకి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుడు..అన్నాడు. అంతే కాదు మరో 67 గుణాలున్న మహానుభావుడు కూడా ఉన్నాడు. ఆయనే శ్రీరామచంద్రుడు’ అని చెప్పాడు.
రాముడికి ఈ 16 సద్గుణాలు( మంచి లక్షణాలు) ఉండడం చేత, ఆ 16 మంచి లక్షణాలు ఉన్న వరుడై ఉండాలని అందరూ రాముడి లాంటి భర్త రావాలని దీవిస్తారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి