24, జూన్ 2023, శనివారం

నమస్కారం విలువ

 *_🙏నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?🙏_*

_[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_

 *===(((🙏🙏🙏)))===*


*మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _"నేను రేపు పాండవులను చంపుతాను"_ అని ప్రకటించాడు.*

*అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.*

*తను బయటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన _"అఖండ సౌభాగ్యవతీ భవ"_ అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.*

*ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా!" అన్నాడు.*

*దానికి ద్రౌపది "అవును తాతయ్యా..! అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.*


*వెంటనే భీష్ముడు.. "నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి" అని ఒక మార్గం ఉపదేశించాడు.*


*శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".*

*"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.*


*👌ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.*

*ఎందుకంటే...*


*🙏నమస్కారం ప్రేమ.*


*🙏నమస్కారం క్రమశిక్షణ.*


*🙏నమస్కారం చల్లదనం.*


*🙏నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.*


*💠నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

 

*💠నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*


*🔶ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.*

_(శ్రీ శిష్ట్లా తమ్మిరాజు గారి సౌజన్యముతో... 🙏)_ 

_🙏🙏🙏ఇదీ మరి నమస్కారం విలువ అంటే..._🙏🙏🙏

కామెంట్‌లు లేవు: