3, జూన్ 2023, శనివారం

ఈ రోజు పద్యము

 179వ రోజు: (శని వారము) 03-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


మాతృభాష నేడు మాకు రాదని పల్కు 

జనులు పెరుగు చుండె జగతిలోన 

'అమ్మ' బాసమరువ నధమాధముండగు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


ఈ ప్రపంచము నందు మాతృ భాషలో చదువుట, వ్రాయుట రాదని చెప్పేవారు ఎక్కువగుచున్నారు. వారు కాలాంతరములో ఏ భాషయందు కూడ పూర్తి నైపుణ్యము (పరిజ్ఞానము)

 లేని వారుగా (రెంటికి చెడిన రేవడి చందాన) తయారగుచున్నారు. 

 

ఈ రోజు పదము. 

అశ్వజాతులు : ఆవర్తి, చోస్కము, జన్నడు, టాంగన్గుఱ్ఱము, నీలడు, పంచకళ్యాణి, పంచభద్రము, పుజవారువము, పూజావాజి, బొల్లడు, భూకలము, యవనము, వనాయుజము, వోల్లాహము, హలుహారము.

కామెంట్‌లు లేవు: