3, జూన్ 2023, శనివారం

_ఘీంకారంతో తప్పిన ముప్పు_*

 





*_ఘీంకారంతో తప్పిన ముప్పు_*


తిరుపతి (తితిదే);

గజరాజుల అప్రమత్తంతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పెనుప్రమాదం తప్పింది. 


ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ  గురువారం రాత్రి వాహనసేవలో పాల్గొనేందుకు అప్పటికే రెండు గజరాజులు (లక్ష్మి, వైష్ణవి) వచ్చాయి. 


భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తూ కొందరు.. తిరిగొస్తూ మరికొందరు.. విశ్రాంతి తీసుకుంటూ ఇంకొందరు.. దుకాణాల వద్ద పలువురు నిల్చుని ఉన్నారు. 


మధ్యాహ్నం 4.40 నుంచి 4.50 గంటల మధ్య చిన్నపాటి చిరుజల్లులతో పెనుగాలులు వీచాయి.


 దీంతో మహద్వారానికి ఎదురుగా _వందల ఏళ్ల నాటి రావిచెట్లు_ కిందకు భక్తులు చేరుకున్నారు.


🐘ఒక్కసారిగా వైష్ణవి అనే గజరాజు ఘీంకారం చేయడంతో చెట్టు కింద ఉన్న భక్తులు అప్రమత్తతో పరుగులు తీశారు. 


ఏం జరిగిందోనని తేరుకుని చూసేలోగా అకస్మాత్తుగా  రావిచెట్టు మొదలు రెండు ముక్కలుగా చీలి నేలకొరిగింది. గజరాజు అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.🙏గోవిందా నీవే  జగతికి రక్ష జై గోవింద🕉️🚩🕉️

కామెంట్‌లు లేవు: