3, జూన్ 2023, శనివారం

ఆహారాన్ని వృధా చేయకండి

 



₹10రూ ల సొంత డబ్బులతో పానీపూరీ కొనుకొనితింటే

 ప్లేట్‌లోని నీళ్లను వదలకుండా తాగుతాము....!


ఐస్‌క్రీం కొంటే చివరికి మూత కూడా నాకుతారము...!


#అలాంటిది మనము పెళ్లిళ్లకు 

డిన్నర్లకు,దావత్లకు, birthday party లకు 

ఇతర వేడుకలకు వెళ్లిన తర్వాత ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తారు?

దాని వల్ల మన హోదా ఏమైనా పెరుగుతుందా ?

ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారం గా మారడానికి, అది మన కడుపులోకి రావడానికి  రైతుల శ్రమ, కష్టం, డబ్బు, కూలీలా చెమట చుక్కలు ఉన్నాయనేది మనం మరవ కూడదు.

మన కుటుంబాలలోనే ఒక తండ్రి, తల్లి తన జీవితమంతా

ఆ ఆహారం కోసం కష్టపడి ఉండవచ్చు.

ప్రపంచంలో అన్నిటికంటే బాధ"ఆకలి"

ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ఆహారం లేక ఆకలి చావులకు గురి అవుతున్నారు.

కడుపులోకి ఎంత కావాలంటే అంత తీసుకో...!

ఆకలిని తీర్చుకో కానీ ఆహారం వృధా చేసి ఇతర ప్రాణుల నోటి ముద్ద దూరం చేయకు

ఇంట్లో అయినా బయట అయినా ఆహారాన్ని వృధా చేయడం మహా పాపం.

*DON'T WASTE FOOD*


దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి.

 ........................✍️

కామెంట్‌లు లేవు: