🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 75
పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా!
లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము.
లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్య విశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు.
అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపర సుఖములని అనుభవింపజేయుమా....
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి