25, ఆగస్టు 2023, శుక్రవారం

🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 7వ శ్లోకం*


 *కార్పణ్య దోషోపహతస్వభావః  పృచ్ఛామి త్వాం ధర్మసమ్ము ఢచేతాః I* 

 *యచ్చ్రేయః  స్యాన్నిశ్చితం భ్రూహి తన్మే శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 7* 


 *ప్రతిపదార్థం* 


 కార్పన్య దోషోప=  పిరికితనమనేడి దోషమునకు లోనైన స్వభావము కలిగినవాడై ; ధర్మ సమ్మూఢ ఛేతాః త్వామ్ = ధర్మ విషయం నా మూఢచిత్తుడనై నిన్ను ;పృచ్చామి = అడుగుచున్నాను; యత్ = ఏ ( ఏ సాధన ); నిశ్చితమ్ = నిశ్చయముగా ; శ్రేయః, స్యాత్ = మేలు అగునో ? ; తత్ = దానిని ; మే = నాకు; బ్రూహి = తెలుపుము ; అహం = ( ఏలననా ) నేను ; తే = నీకు; శిష్య: = శిష్యడ ను ' త్వామ్ = నిన్ను; ప్రపన్నమ్ = శరణు పొందిన వాడను ; మామ్ = (కనుక) నన్ను (నాకు);శాధి = ఉపదేశింపుము ;


 *తాత్పర్యము* 


 కార్పన్య దోషము (పిరికితనము )నకు లోనైన నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నాకర్తవ్యమును నిర్ణయించుకున్న లేకున్నాను.నాకు నిజముగా శ్రేయస్కారమైన దానిని తెలుపుము.నేను నీకు శిష్యుడను.శరణాగతుడను, ఉపదేశింపుము.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

కామెంట్‌లు లేవు: