2, నవంబర్ 2023, గురువారం

మంచిమాట

 🕉️    *ఒక మంచిమాట*   🕉️


మనిషి జీవితాన్ని ఎవరూ అంచనా వేయలేరు . కాలం ఎవరికి ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో ఎవరూ ఊహించలేరు. ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా అనుకోని చిక్కుల్లో ఇరుక్కొని సర్వం పోగొట్టుకునే జీవితాలు కొన్ని ఉన్నాయి.ఏమీ లేని వాడు ... చదువు లేని వాడు కూడా అందలంఎక్కి రాజ్యమేలే జీవితాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేసి చులకనగా చూడకూడదు. మనకన్నా గొప్పవారైతే అనుసరించాలి.. ఈర్ష్య చెంద కూడదు, తక్కువవారైతే చేయి అందించాలి కానీ చులకనగా చూడకూడదు. అది మన సంస్కారం. ఎందుకంటే విసిరి వేయబడిన విత్తనాలు సైతం మొలకెత్తుతాయి... ఎందరికో జీవనాధారం అవుతాయి. అలాగే విమర్శించ బడిన జీవితాలు సైతం వెలుగెత్తు తాయి... ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు... ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు . మనం ఎప్పుడూ ఒకరికి సహాయము చేయాలన్న తపన ఉన్నప్పుడు  పుణ్య క్షేత్రాలు తిరిగినా రాని పుణ్యం.. ఫలితం లభిస్తుంది. దేవుడికి పెట్టే దండం , ఆకలిగా ఉన్నవారికి పెట్టే అన్నం , ఆపదలో ఉన్నవారికి చేసిన సహాయం , ఎప్పటికీ ఊరికే పోవు . ఏదో ఒక రోజు మనల్ని ఆదుకోక మానవు . బండలు మోయగలిగే కండ బలం ఉన్న వాడికంటే బాధ్యతలు మోయాగలిగే గుండె బలం ఉన్న వాడు నిజమైన బలవంతుడు. అలాగే స్నేహ   సంబంధం .. మనబలం మరియు అదే మన బలగం. కాబట్టి అది మనస్పర్ధలతో ముగియకూడడు . ఈ ప్రపంచంలోస్నేహబంధం కంటే అందమైనది ఏదీ ఉండదు . అది గుర్తించినప్పుడు ఎవరీలోను ఒంటరితనం కనిపించదు . మనసంతా ద్వేషం నిండినవాడు మనశ్శాంతిగా ఏనాడూ బ్రతక లేడు.  ఎవరినీ మాటలతో బాధ పెట్టకూడదు . ప్రతీ మాట ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మాట చిన్నదైనా మనసు గాయపరుస్తుంది., అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది., అపార్థం చిన్నదైనా బంధాలను విడగొడుతుంది., రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది . అర్థం చేసుకోలేని బంధం, అవసరానికి కానరాని స్నేహం .. ఉన్నా .. లేకున్నా .. ఒక్కటే. 

      

    *సర్వేజనాః సుఖినోభవంతు*

కామెంట్‌లు లేవు: