శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
సాయంకాల హోమాలకూ పూజలకూ సంబారాలు
సమకూరుస్తోంది. నైవేద్యాలకు ఫలాలు సిద్ధం చేస్తోంది. అందిస్తూ పూజలు నిర్వహింపజేస్తోంది.
ముగిశాక నివేదితఫలాలను ప్రసాదంగా తినిపిస్తోంది. మెత్తని శయ్య ఏర్పరచి పరుండబెడుతోంది. కాళ్ళు
పట్టి భర్తకు సుఖనిద్ర పట్టేట్టు చేస్తోంది. భర్త అడిగితే, కులస్త్రీ ధర్మాన్ని కాదనకుండా నిర్వహిస్తోంది. అతడి
పాదాలచెంత తానూ నడుం వాలుస్తోంది. అర్ధరాత్రీ అపరాత్రీ భర్త నిద్రలేస్తే, అలికిడికి తానూ లేచి
వింజామర వీస్తోంది. శీతకాలమైతే పుడకలతో సన్నమంట రగిల్చి వెచ్చదనం కలిగిస్తోంది.
తెల్లవారుజామున పతి నిద్రలేచే సరికే తాను శుచియై భర్తకు కాలకృత్యాల కోసం పాత్రతో నీళ్లూ
మట్టిముద్దా సిద్ధంచేసి అందిస్తోంది. తానే కూడాఉండి దూరభూమికి తీసుకువెడుతోంది. అక్కడ
కూర్చోబెట్టి తాను చాటున నిలబడుతోంది. ముగించుకున్నాడని తెలిశాక దగ్గరకు వెళ్ళి పాత్రను
అందుకుని నడిపించుకుని పర్ణశాలకు తీసుకువస్తోంది. అరుగుమీద కూర్చోబెట్టి కాళ్ళు శుభ్రంగా కడిగి,
ఆచమనం అందించి, దంతకాష్ఠంతో ధావనం చేయించి, గోరువెచ్చని శుద్ధోదకంతో స్నానం చేయిస్తోంది.
స్నానం చేస్తూ అవసరమైన మంత్రాలను చ్యవనుడు మననం చేసుకుంటున్నాడు. ఇది సంధ్యాసమయం
ఇది హోమకాలం అంటూ తెలియపరిచి ఆయావిధులను క్రమం తప్పకుండా నిర్విఘ్నంగా నిర్వహింపజేస్తోంది.
ఇటువంటి దినచర్యతో సుకన్యాదేవి చ్యవనమహర్షిని భక్తిశ్రద్ధలతో సేవిస్తోంది. ఆరాధిస్తోంది.
అప్పుడప్పుడు వచ్చివెళ్ళే అతిథి మహర్షులకు ఉచితరీతిని గౌరవమర్యాదలు నెరపుతోంది. ఆనందంగా
కాలం గడుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి