2, నవంబర్ 2023, గురువారం

 ***** ఆలోచనాలోచనాలు *****                                   వ్యక్తి నిర్మాణం లో గొప్ప గుణాల పాత్ర                        ***** జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన పన్నెండు అంశాలు.*****      1* సమయం విలువ ( పోగొట్టుకొంటే లభించనిది, ఇదే!)                    2* పరిశ్రమకు దక్కే విజయం ( ఎవరైనా మంచి పనివంతుని మాత్రమే కోరుకొంటారు)                       3* పనిలోని ఆనందం ( శ్రమించడం ద్వారా పొందే తృప్తి మరిదేనితోను సాటిరాదు)                           4* నిరాడంబరతలోని గౌరవం ( మహనీయులంతా నిరాడంబరతలోని మాధుర్యాన్ని అనుభవించారు. వారే మనకు ఆదర్శం)                    5* సౌశీల్యం విలువ ( విలువ తక్కువగా వున్న మనిషి కూడా గౌరవించేది సద్గుణాలనే)                         6* కారుణ్యానికి గల శక్తి ( దయ గల హృదయం భగవన్నిలయం)                    7* ఆచరణ చూపే ప్రభావం ( వెయ్యి మాటలు చెప్పు; ఆచరణాత్మకమైన ఒక మంచి పనికే విలువ ఎక్కువ)                               8* విధి నిర్వహణ లోని గురుతర బాధ్యత ( తన కర్తవ్యనిర్వహణలో అసువులు బాసినవారిని ప్రభుత్వాలు మరియు ప్రజానీకం ఎల్లప్పుడూ శిరస్సు వంచి నమస్కరిస్తాయి)                        9* పొదుపు లోని వివేకం ( చిట్టి చీమ, తేనెటీగ వంటి అల్ప ప్రాణులు కూడా రేపటి గడ్డు రోజులను ఎదుర్కోవడానికి పొదుపును పాటిస్తాయి)         10* ఓర్పు వహించడం లోని సుగుణం ( ఓర్పు ఒక నేర్పు; ఓర్చుకోవడం ద్వారా గడ్డు పరిస్థితులను అధిగమించవచ్చు)                     11* ప్రతిభకు పదును పెట్టడం ( వాడుతున్న కత్తి తళతళా మెరుస్తూవుంటుంది. ఉపయోగంలో లేనిది త్రుప్పు పట్టి పనికిరాకుండా పోతుంది. శరీరమైనా, బుద్ధి అయినా తగినంత శిక్షణ మరియు వ్యాయామాన్ని పొందివుండాలి)                   12* సృజనాత్మకలోని ఆనందం.( ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుగొని లోకం ముందు ఉంచడం ద్వారా పొందే ఆనందాన్ని మరి దేనితోను పోల్చలేం.)            ***** అందరినీ భ్రమింపజేసి, మాయలో ముంచెత్తే  ఊహ ఏమిటంటే అంతులేని సంపదలు, అధికారం, హోదాలు, ఉన్నత పదవులు మనశ్శాంతిని ఇస్తాయని. ఎండమావులలో నీటిజాడ ఎటువంటిదో పై వాటివలన పొందే ఆనందం కూడా అటువంటిదే!                        ***** నక్కకు "తలకాయ" లాగా ఎన్నాళ్ళు ఉన్నా ఏంలాభం? కనీసం సింహానికి "తోక" లాగా ఒక్క రోజైనా బ్రతుకు!              ***** పవిత్రత అంటే ఏమిటి? పదిమంది ముందు చేస్తే తలవంచుకొనే పనులను ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యకుండా ఉండటం.                             ***** మనిషి వ్యక్తిత్వం తోటి జీవజంతువుల పట్ల అతడి ప్రవర్తన, ఎటువంటి స్పేహితుల మధ్య కాలం గడుపుతున్నాడు, తీరిక సమయాన్ని ఎట్లా వెచ్చిస్తున్నాడు, అతడు అధ్యనం చేసే గ్రంథాలు , బంధువులతో అతనికి గల సాన్నిహిత్యం మొదలగు అంశాల ద్వారా నిర్ణయింపబడుతుంది.           తేది 2--11--2023, గురువారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: