21, సెప్టెంబర్ 2024, శనివారం

*ప్రాచీన ఇతిహాసము

 ☀️ఓ3మ్ ☀️ఓ3మ్☀️ఓ3మ్☀️ఓ3మ్☀️

              మన *.☀️ఓ3మ్ ☀️ఓ3మ్☀️ఓ3మ్☀️ఓ3మ్☀️

              మన *ప్రాచీన ఇతిహాసము* 

     *మహర్షి దయానందుని అభిప్రాయాలు*

                    *పూనా ప్రవచనాలలో*


        మనుధర్మశాస్త్రం ప్రకారం ప్రజలందరు కలిసి యోగ్యత కలిగిన ఒక వ్యక్తిని ఎన్నుకొని రాజుగా చేయాలి.

 ఇక్ష్వాకుడు కూడా ఆ విధంగా ప్రజలచే ఎన్నుకొనబడిన రాజే. కొందరు ఋషులు మనుమహారాజును సమీపించి వర్ణాశ్రమ ధర్మాలను గురించి, రాజ్యవ్యవస్థలను గురించి చెప్పమని కోరారు. అప్పుడు మనువు వాటిని వివరించి చెప్పాడు. ఆ మను భావాలను భృగుమహర్షి గ్రంథస్థం చేసారని చెబుతారు. ఇవి శ్లోకాలుగా కనబడతాయి. లోకంలో శ్లోకరచన రామాయణంతో ప్రారంభమయ్యిందనీ, వాల్మీకి ఆదికవియనీ, రామాయణమే ఆదికావ్యమనీ అనుకుంటూ ఉంటారు.

 ఇది సరికాదు. అంతకు పూర్వానిదే అయిన మనుస్మృతియే ఆదికావ్యం.

 అప్పుడే శ్లోకరచన ప్రారంభమయ్యింది. 

          మనుస్మృతిలో 7,8,9, అధ్యాయాలలో రాజ్యవ్యవస్థ ఎలా ఉండాలో వివరింపబడింది. 

దాని ప్రకారం ఏర్పడిన రాజ్యంలో వ్యవస్థ ఎలా ఉండేదో సంక్షిప్తంగా తెలియపరుస్తాను. సుమారు నూరు గృహాలు ఉంటే అది గ్రామం,

 వేయి గృహాలుంటే అది మహా గ్రామం, పదివేలు గృహాలు ఉంటే నగరం, పదివేలకు పైన గృహాలు ఉంటే దానిని పురం అనేవారు. 

10 గ్రామాలపై ఉండే అధికారిని దశేశుడు, వంద గ్రామాలపై అధికారిని శతేశుడు అనేవారు. 

ఇట్లే సహస్రేశుడు, దశ సహస్రేశుడు ఉండేవారు. వీరి పనితీరును పరిశీలించే గూఢచారులు ఉండేవారు. వీరందరిపై పరిపాలన చేసే రాజ్యాధికారి, సేనాధికారి, న్యాయాధికారి, కోశాధికారి అనే నలుగురు అధికారులుండేవారు. అట్టి వ్యవస్థకు ఒక అధ్యక్షుడుండేవాడు. అతనినే రాజు అనేవారు. ఆర్యావర్త రాజసభకు మొదటి అధ్యక్షునిగా ఇక్ష్వాకుని ఎన్నుకొన్నారు. 

          ఇవేగాక ధర్మార్యసభ, విద్యార్యసభ ఉండేవి. వీటిపని కేవలం ధర్మాధర్మ వివేచన, విద్యావ్యవస్థలే. నిర్ణయాధికారం పై రాజార్యసభకు మాత్రమే ఉండేది. సైనిక వ్యవస్థ కూడా ఉత్తమంగా ఉండేది. ఇప్పటి వలెనే

 సైనికులు చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఆజ్ఞాపాలనమే వారి కర్తవ్యంగా ఉందేది. వారికి ధనుర్వేదం నేర్ప

బడేది. 

నేటి యుద్ధవ్యవస్థ కన్నా ప్రాచీన కాలంలో విశేషంగా వ్యూహరచన ఉండేది. మకర వ్యూహం,

 బక వ్యూహం, బలాకావ్యూహం, సూచీవ్యూహం, సూకర వ్యూహం, శకట వ్యూహం, చక్రవ్యూహం మొదలైన వ్యూహరచనలు వారికి నేర్పబడేవి. ఇట్టివి రామాయణ భారతాలలో మనకు కనబడతాయి. అనేకరకాల అస్త్రశస్త్రాలుండేవి. సైనికులను కూడా  శ్రద్ధగా చూసేవారు. సైనిక వ్యవస్థపైనే సమస్త ఐశ్వర్యాలు ఆధారపడి ఉన్నాయని భావించేవారు.  



                                              ….సశేషం

                                             ✍️ సుమ్నార్థి


Typing : Jupudi Sridevi

☀️🌏🪐

కామెంట్‌లు లేవు: