.
.
.
.విశ్వా వసు నీకు స్వాగతం
-------------------------
కొత్త వసంతమా నీకు స్వాగతం
కాలచక్రంలో ఎన్నో మార్లు వచ్చావు ప్రతిసారి వస్తావు
. అందుకే
మామిడాకుల తోరణాలతో
రంగురంగుల ముత్యాలముగ్గులతో
వాడ వాడ ఊరు ఊరంతా
అందంగా సింగారించుకున్నది
నీకు స్వాగతం పలకడానికి
ఓ శ్రీ విశ్వాస నామ సంవత్సరమా నీకు సుస్వాగతం
కొత్త యుగాది వస్తూ వస్తూ మా జీవకోటికి మానవాళికి వీటిని తీసుకురా
విపత్తులు లేని ప్రకృతిని
పుడమి తల్లి తడి ఆరని జలరాశిని
పసిడి పంటలు పాలదారులు
మృగ జాతులు జలచరాల సమృద్ధిని
జగతికి అన్నం పెట్టే కర్షకుడి ముఖంలో ఆనందాన్ని తీసుకురా
ఓ విశ్వావసు వీటి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచు
కొత్త కొత్త వైరస్లను మా దరిదాపుల్లోకి
చేరనివ్వకు
దేశ ప్రజల మధ్య అక్రోషాలు అంతర్యుద్ధాలు రానివ్వకు
ప్రపంచంలోని దేశాల మధ్య
కలహాల కంచెలు కాదు
ప్రేమానురాగాల వార్డులను కట్టే బుద్ధిని ప్రసాదించు
గనుల్లో కర్మాగారాలలో పనిచేసే
శ్రమ వీరులను ప్రమాదపు అంచుల నుంచి దూరం చెయ్యి
వెర్రి వేగంతో ప్రమాదాలు కొనితెచ్చుకునే చెడు వ్యసనాలకు బానిసలయ్యే
ప్రేమ పేరుతో మోసం చేసే
తీయ తీయని మాటలతో
వంచన చేసే దగాకోరులను
దళారులను బడా చోర్ బాబాలను
క్షమించకు
పసి హృదయాల్లో విషయాన్ని నింపి స్వార్థాన్ని పెంచే సీరియల్ లను సినిమాలను
బెట్టింగుల పేరుతో యువతను బేజార్ ఎత్తించే సైట్లను
సైబర్ నెరగాలను దేశద్రోహులను
దోపిడీ దొంగలను నయవంచకులను
మట్టుపెట్టి మట్టి కరిపించు
విజ్ఞానంతో ప్రజలు ప్రపంచంలో పోటీపడే జ్ఞానాన్ని ప్రసాదించు
మన యువతను అన్ని రంగాల్లో
ముందుంచు
శ్రీ విశ్వా వసు వేలు పట్టి సన్మార్గంలో నడిపించు
ఓ కాలచక్రమా నువ్వు మంత్రదండానివి
నువ్వు ఆడించినట్టు మేము ఆడుతాం
ఆడాలి కూడా
ప్రపంచ మానవాళి నీ చేతిలో కీలుబొమ్మలు
శ్రీ విశ్వా వసు మంచిగా ఆడించు
జగతికి హితాన్ని ప్రసాదించు.
. ప్రజ్ఞామయి
. ------------
. హరికృష్ణ
. తెలుగు పండిత్
. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నవర్వాల్ మహబూబ్నగర్ జిల్లా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి