31, డిసెంబర్ 2025, బుధవారం

మన వంశం మనుగడ కోసం

  *2319*

*కం*

మన వంశపు మనుగడకై

తనయను దానమ్ముజేయు ధార్మిక మతులన్

కనుగానని మత్సరమున(యున్మదమున)

ననయము దూషించుటెల్ల నఘమగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మన వంశం మనుగడ కోసం తమ కూతురిని దానం చేసిన ధార్మిక మనస్కులను కనుగానని ఉన్మాదంతో ఎల్లప్పుడూ దూషించడం పాపము.

*సందేశం*:-- కొందరు తమ వంశాభివృధ్ధి కోసం కన్యాదానం చేసి న గొప్ప దాతలను నిరంతరమూ తిడుతూ ఉంటారు, లేదా లోకువగా చూస్తూ ఉంటారు, అది మహాపాపం. అటువంటి పాపము ల వలన వంశవృధ్ధి క్షీణించును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: