*🙏హరిహర స్వరూపం🙏*
*🕉️శంకరనారాయణ స్వరూపమూ అర్థనారీశ్వర స్వరూపమూ రెండూ ఒకటేనని* *చెప్పడానికి శాస్త్రాలలో ఆధారాలు ఉన్నాయి*.
*మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం;* *ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగ మని చెప్పడానికి పురాణాల మూర్తులు, క్షేత్రాలు ఆధారాలు.*
*దక్షిణాన తిరునెల్వేలి జిల్లాలో శంకర్ నయనార్ కోయల్ అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకరనారాయణ స్వరూపంగా భగవానుడు ఉండటం నేటికీ మనం చూడవచ్చు.*
*ఇలాగే మైసూరు, మహారాష్ట్రల ముధ్య 'హరిహర' క్షేత్రంలో హరి, హరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు.*
*🙏కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి 🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి