*మన ఆరోగ్యం…!
*వంటగదిలోనే…*
*సుగర్ తగ్గించే…*
*దినుసులు..!*
➖➖➖✍️
```
మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అనేక మార్గాలున్నాయి. కొన్ని మన వంటగదిలోనే ఉంటాయి. జీలకర్ర, చియా, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ.
ఈ కారణాలతో వీటిని వాడితే.. ఇవి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి.
ఈ విత్తనాలన్నింటిలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగనివ్వదు.
చక్కెర శోషణను, జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది.
ఈ విత్తనాలు ప్రతి ఒక్కరి ఇంటి వంటగదిలో ఉంటాయి.
ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.
#జీలకర్ర : రక్తంలో యూరియా స్థాయిని తగ్గించడంతోపాటు మధుమేహం లక్షణాలను నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గించాలనుకునేవారు తమ ఆహారంలో జీలకర్రను చేర్చుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్.. రెండూ మన శరీరంలో పెరుగుతాయి.
#మెంతులు : ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఖాళీ కడుపుతో తాగాలి. దీనివల్ల షుగరు అదుపులో ఉంటుంది. మెంతికూర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సహజంగానే తగ్గిస్తుంది.
#గుమ్మడి గింజలు: వీటిల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది ఎంతో ప్రయోజనకారి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇవి తోడ్పడతాయి.
#పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా తగ్గిస్తుంది. ఈ గింజల్లో ఫైటోస్టెరాల్, గ్లైకోసైడ్స్, కెఫిన్, కునిక్ యాసిడ్ ఉంటాయి.✍️```
-సేకరణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి