కోనసీమ జిల్లా, అమలాపురం సమీపంలో ఏకాదశ రుద్రులు అను 11 శైవ క్షేత్రములు ఉన్నాయి. ఇవి లోక ప్రసిద్ధి. ఏక కాలములో వీటిని దర్శించుట పుణ్యదాయకము. చుట్టు ప్రక్కల జిల్లాలు నుంచి సోమవారం నాడు భక్తులు సందర్శించుట జరుగుతుంది. ముఖ్యముగా కార్తీక మాసములో సందర్శకులు విశేషముగా తరలి వస్తారు.
ప్రతి కనుమ రోజున ఏకాదశ రుద్రులు, వారి వారి ప్రభల పైన ఊరేగింపుగా సమీపంలో గల జగ్గన్న తోటకు చేరుకుంటారు. అక్కడ లోక కళ్యాణం కోసం ఏకాదశ రుద్రులు సమవేశం అవుతారు అని స్ధానికులు చెప్పుచుంటారు. ప్రభల తీర్ధం సందర్శించుటకు భక్తులు తండోపతండాలుగా వస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి