తెల్ల బట్ట ( Leucorrhea) సమస్య - సంపూర్ణ వివరణ -
తెల్లబట్ట అనేది మహిళల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది యోని నుంచి వచ్చే ఒకరకమైన తెల్లటి ద్రవం. ఇది సాధారణంగా తెలుపు రంగు లేదా పాల రంగులో ఉంటుంది. ఇది సాధారణంగా ఋతుచక్రం లో వివిధ దశల్లో హార్మోన్ల మార్పు వలన సంభవిస్తుంది. దీని స్థాయిలో హెచ్చు మరియు అసాధారణ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడటం ముఖ్యం.
తెల్లబట్ట రావడానికి ప్రధాన కారణాలు -
* గర్భనిరోధక మాత్రలు వాడటం మరియు హార్మోనల్ ఇన్ బాలన్స్ వలన కూడా ఇది వస్తుంది.
* ఇన్ఫెక్షన్ సమస్య వలన ముఖ్యంగా యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ వాగినోసిస్ లేదా ఇతర ఇన్ఫెక్షన్స్ వలన కూడా తెల్లటి జిగురు వంటి ద్రవం బయటకు వస్తుంది. ఈ ద్రవం దుర్వాసన తో కూడుకొని అసాధారణ స్థితిలో ఉంటుంది.
* పరిశుభ్రత లోపం, ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యపు ఆహరపు అలవాట్లు, దీర్ఘకాలపు మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువుగా ఉండటం కూడా కారణం అవుతాయి.
తెల్లబట్ట లక్షణాలు -
* తరచుగా జ్వరం వచ్చి ఉష్ణోగ్రత గణనీయంగా పెరగడం
*. కడుపులో అప్పుడప్పుడు భరించలేని నొప్పి, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం.
* అకస్మాతుగా బరువు తగ్గడం, యే పని చేయకున్నా త్వరగా అలసిపోవడం.
* యోని ఎల్లప్పుడూ తడిగా ఉండటం మరియు దూరదగా అనిపించడం సంభోగ సమయంలో నొప్పి, మంట గా ఉండటం, యోని నుండి దుర్వసన రావడం.
ఇలా యోని నుంచి తెలుపు మాత్రమే కాదు పసుపు పచ్చ, ఆకుపచ్చ, ఎరుపు రంగులో కూడా స్రావాలు బయటకు వచ్చును. ఇది లోపల ఇన్ఫెక్షన్ మరియు బ్యాక్టీరియా తీవ్రతను బట్టి ఉంటుంది. ఇది తీవ్ర దుర్వాసన తో ఉంటుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడువారు సమస్య ముదిరే కొద్ది బలహీనత ఎక్కువ అయ్యి ఇబ్బంది పడతారు. స్రావం ఎరుపురంగులో ఉంటే దానిని "ఎర్రబట్ట " అని ఆయుర్వేదంలో పిలుస్తారు.
పైన చెప్పిన సమస్యకు ఆయుర్వేదంలో చాలా చక్కని పరిష్కారం ఉంది. ఎంతటి దీర్ఘాకాలంగా ఉన్న "తెల్లబట్ట " మరియు "ఎర్రబట్ట " సమస్య అయినా సంపూర్ణంగా పరిష్కారం చూపించబడును.
ఈ సమస్యతో ఇబ్బంది పడువారు నన్ను సంప్రదించగలరు. సంప్రదించవలసిన నెంబర్
9885030034.
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి