31, డిసెంబర్ 2025, బుధవారం

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ 

శబ్దాదీన్ విషయాన్, త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ (51)


వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః 

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః (52)


అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ 

విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే (53)


పరిశుద్ధమైన బుద్ధికలిగి, ధైర్యంతో మనసును వశపరచుకుని, శబ్దాది విషయాలనూ రాగద్వేషాలనూ విడిచిపెట్టి, ఏకాంతవాసం చేస్తూ, మితంగా తింటూ, మాటలు, శరీరం, మనసులను అదుపులో పెట్టుకుని, నిరంతరం ధ్యానయోగంలో వుంటూ, వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం, వస్తుసేకరణలను వదలిపెట్టి, మమకారం లేకుండా శాంతస్వభావం కలిగినవాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

కామెంట్‌లు లేవు: