8, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఉసిరికాయ పై దీపం ఎందుకు వెలిగిస్తారు?

కార్తీక మాసం లో ఉసిరికాయ పై దీపం ఎందుకు వెలిగిస్తారు?
వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే. దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి. అదే మానవ దేహం ప్రుధివీతత్వం. వైరాగ్యం తో కూడిన తైలం. నూనె కావాలి. ఇది జలతత్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. ఇది జలతత్వం. భక్తి అనే వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశ తత్వం. వెలిగించడానికి అగ్ని కావాలి. వెలిగించిన తర్వాత ఆ దీపం ఆఖండంగా వెలగడానికి గాలి కావాలి. అది వాయు తత్వం. ఇలా పంచ తత్వాలతో కూడినదే దీపం. మానవుని లో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరి పోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదిలి పెట్టడానికి, అఙ్ఞానం తొలగి ఙ్ఞానం పొందడానికి కార్తీక దీపం దానం చేస్తాము.
♦️💚♦️💚♦️💚♦️💚

కామెంట్‌లు లేవు: