ఆ కాలంలో..... కాంచనమాల, కన్నాంబ విపరీతమైన ఆకర్షణ ఉన్న పెద్ద స్టార్స్. నీకు కాంచనమాల కావాలా? కన్నాంబ కావాలా?, అని ఒక అవధానిని మద్రాస్ లో ఒక పృచ్ఛకుడు (ప్రశ్నించేవాడు) అడిగాడు... " ఈ బంగారం గొలుసులు ఎప్పుడైనా, ఎన్నైనా కొనుక్కోవచ్చు.నాకు ఎప్పటికీ కావాల్సింది కన్నాంబ, అని సమాధానం చెప్పాడు. కన్నాంబ = కన్నతల్లి. కాంచనమాల= బంగారు గొలుసు/మాల. ఈ సమాధానం చెప్పిన అవధాని శ్రీ కొప్పరపు సీతారామప్రసాదరాయ కవి,శతావధాని. గుంటూరులో జరిగిన ఒక వివాహానికి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు, సీతారామప్రసాదరావు వెళ్లారు. పెళ్లిచేసుకొనే ఆ జంటను ఆశీర్వదిస్తూ, విశ్వనాథ పంచరత్నాలు రాసుకొని వచ్చారు.నాయనా! కళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి... నువ్వు కాస్త చదివిపెట్టు... అని సీతారామప్రసాదరావుకు ఇచ్చారు.ఆ పద్యాలలో అక్కడక్కడా చిన్న చిన్న దోషాలు ఉంటే, వాటిని అశువుగానే సరిచేస్తూ పంచరత్నాలు చదివి వినిపించారు.ఇది గమనించిన కవిసమ్రాట్ పులకితగాత్రుడై, సీతారామప్రసాదరాయకవిని ఆలింగనం చేసుకొని, ఆనందభాష్పాలు రాల్చి, తనపై ఉన్న శాలువాను కప్పి సత్కరించారు.1987ప్రాంతంలో " ఏకాదశ రుద్రులు " అనే పేరుతో టి.సుబ్బిరామిరెడ్డి విశాఖపట్నంలో గొప్ప సాహిత్యసభ ఏర్పాటుచేశారు.ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఈ సభ జరిగింది.ఇంతటి బృహత్ సభ అక్కడ జరగడానికి సరసహృదయంతో సహకరించినవారు అప్పటి వైస్ ఛాన్సలర్ శ్రీ కోనేరు రామకృష్ణారావుగారు. కరుణశ్రీ, దాశరథి, ఎస్వీ జోగారావు, ప్రసాదరాయకులపతి (నేటి కుర్తాళ పీఠాధిపతి), నాగభైరవ కోటేశ్వరరావు, పులికంటి కృష్ణారెడ్డి... ఇలా మహామహులెందరో ఉన్న పెద్ద సభ అది. " చాల్ బిడ " అనే పదం వాడుతూ గణపతిరాజు అచ్యుతరామరాజుగారు ఒక సమస్య ఇచ్చారు.ఆ సమస్యా పూరణ ఉఫ్.. అని ఊది విసిరి పారేశారు. చాల్ బిడ = చాలు బిడ్డ =నాగలిచాలు బిడ్డ.అంటే, సీతాదేవి అనే అర్ధాన్ని చిటికలో గ్రహించి, పద్యాన్ని రామబాణంలా, మారుత వేగంతో పరిగెత్తించారు.
ఆరోజు, ఈ అవధానకవి వీర విహారం చేశారు.పలనాటి పౌరుషాన్ని, కొండవీటి క్షాత్రాన్ని పద్యవిన్యాసంలో చూపించారు.వేదిక ఊగిపోయింది.సభ మోగిపోయింది.అప్పటికే 60ఏళ్ళ వయస్సు దాటి, సతీవియోగంతో, రెండుసార్లు గుండెపోటు వచ్చి, శరీరం డస్సిపోయిన స్థితిలో గుప్పించిన కవితా ప్రవాహానికి అదొక తార్కాణం. వీరే... ఇలా ఉంటే? వీరి పితృదేవతలైన కొప్పరపు సోదరకవులు ఎలా ఉండేవారో !? ..
అనే ఆలోచనలు... ఆ సభలో ఉన్నవారిని చుట్టుముట్టాయి. అదే సభలో ఉన్న పులికంటి కృష్ణారెడ్డి ఏదో గేయం చదివారు.సీతారామప్రసాదరావు ఒక్క ఉదుటున ఆయన దగ్గరకు వెళ్ళి, కౌగిలించుకొని అభినందించారు.ఒక పద్యస్వరూపం -ఒక గేయస్వరూపాన్ని ఆలింగనం చేసుకున్న అద్భుతమైన సందర్భం అది. అంతటి రసహృదయులు సీతారామప్రసాదరాయకవి.ఈ సభకు ప్రత్యక్షసాక్షులైనవారు ఈ facebook వేదికలో చాలామంది ఉన్నారు.ప్రఖ్యాత నటుడు,పద్యకవి డాక్టర్ మీగడ రామలింగస్వామి, ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగుశాఖాధిపతిగా చేసిన ఆచార్య పర్వతనేని సుబ్బారావుగారు ఆ సభ జరిగినప్పుడు ప్రేక్షకులలో ఉన్నారు.ఇప్పుడు, ఈ facebook వేదికలోనూ ఉన్నారు. సుప్రసిద్ద సంపాదకులు, ఇటీవలే కీర్తిశేషులైన పొత్తూరి వెంకటేశ్వరరావుగారి పెళ్లి గుంటూరుజిల్లా ఈమనిలో జరిగింది.కోన వెంకటరాయశర్మగారిచ్చిన "అరగజము కన్న, గజము తానడుగు చిన్న" సమస్యను అవలీలగా పూరించారని, పొత్తూరిగారు అక్షరబద్ధం చేశారు.ఇలాంటి అద్భుతమైన సందర్భాలు ఈ కవి జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి.సీతారామప్రసాదరాయకవిగారిది గుంటూరుజిల్లా నరసరావుపేట.సుప్రసిద్ద కొప్పరపు సోదరకవులలో పెద్దవారు వేంకటసుబ్బరాయకవిగారి సుపుత్రులు. కుమారసోదరకవులలో ( మల్లికార్జునరావు, సీతారామప్రసాదరావు) ద్వితీయులు. ప్రతిభలో అద్వితీయులు. 1924లో నరసరావుపేట దగ్గర కొప్పరంలో జన్మించారు. 1987లో పరమపదించారు.ఊహ తెలిసినప్పటి నుండి తుది శ్వాస వరకూ కవిత్వంలోనే జీవించారు.కవిత్వాన్నే శ్వాసించారు.పద్యాన్ని శాసించారు.ఒకరి దగ్గర బంట్రోతుగా ఉద్యోగం చెయ్యనని భీష్మించి, వ్యవసాయం, కవితా సేద్యంపైనే జీవనం సాగించారు."సత్కవులు హాలికులైననేమి " అని చెప్పిన పోతన్న స్ఫూర్తి గుండెలో నింపుకున్నారు.పోతన్న, కొప్పరపువారూ కౌండిన్యస గోత్రీయులే కావడం ఇక్కడ విశేషం.తన 7వ ఏటనే తండ్రిని కోల్పోయారు.అమాయకమైన తల్లి, మూడేళ్ల చెల్లి, 10ఏళ్ళ అక్కలతో బాల్యం సాగించారు.కర్రసాము, రాళ్లు ఎత్తడం మొదలైన కఠోర వ్యాయామాలు చేసి శరీరాన్ని, నిత్య సహస్ర గాయత్రీ ఉపాసనతో ఆత్మను, పద్య సాధనతో హృదయాన్ని, మెదడును వజ్రంగా మలుచుకున్నారు.వజ్రసంకల్పంతో అవధాన కవితా సామ్రాజ్యంలోకి ప్రవేశించారు.తన తొలినాళ్లల్లో గురిజేపల్లిలో అవధానం, నరసరావుపేట పాతూరు ( అట్లూరు) ఆంజనేయస్వామి దేవాలయంలో , పినతండ్రి, గురువు కొప్పరపు వేంకటరమణకవి సన్నిధిలో ఆశుకవితా విన్యాసం శ్రీకారం చుట్టారు. యావత్తు తెలుగునేలను వాగ్ఝరితో రసప్రవాహంగా మలిచారు. పితృదేవతలైన కొప్పరపు సోదరకవులను మళ్ళీ తెలుగువారి తలపుల్లోకి తెచ్చారు. తండ్రి సంపాయించిన వందలాది ఎకరాల భూమి, కవితా సంపద సర్వం చిన్ననాడే కోల్పోయినా, ఆత్మవిశ్వాసం ఆలంబనగా బతుకుబండి సాగించారు.కష్టపడి పిల్లలను చదివించారు.పిల్లలు ప్రయోజకులయ్యారు.63ఏళ్ళు పూర్తిగా నిండకముందే, అలసిపోయి, శివైక్యమయ్యారు. నరసరావుపేట-వినుకొండ మార్గంలో సంతమాగులూరుకు 5కిలోమీటర్ల దూరంలో కొప్పరం ఉంది.ఈ ప్రాంతం చాలా గొప్పది.ఇది పలనాటి సీమ.కొండవీటి క్షేత్రం.ఈ ఊరికి కొంచెం అటుఇటు ఊర్లలోనే శ్రీనాథుడు,ఎర్రాప్రగడ, నన్నెచోడుడు, వినుకొండ వల్లభరాయుడు మొదలైన కవి సింహాలు నడయాడి, వసించి, భాసించారు.పొలాల్లో గుండా వెళ్తే, కోటప్పకొండ కూడా ఈ ఊరికి దగ్గరగానే ఉంటుంది. వీరి చిన్నాన్నగారే వీరికి గురువు. చిన్నాన్నగారంటే, కొప్పరపుకవులలో రెండవవారైన వెంకటరమణకవియే కావడం విశేషం!! గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నారు.మిన్నికంటి గురునాథశర్మగారు విద్యాగురువు. చిన్ననాడే (12వ ఏట)అవధానాలు చెయ్యడం, , ఆశుకవిత్వం చెప్పడం ఆరంభించారు.1987వరకూ కొన్ని వందల కవితా ప్రదర్శనలు ఇచ్చారు. సుప్రసిద్ధులెందరో వీరి సభల్లో పాల్గొన్నారు. తిరుపతి వేంకటకవులలో అగ్రజులు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు.... "కొప్పరపున్ కవీశ్వరుల కూరిమి నందనులారా (కుమారులు) లెండికన్...." అని దీవిస్తూ.... స్వయంగా అధ్యక్షులుగా ఉండి, సీతారామప్రసాదరావుతో ఎన్నో అవధానాలు చేయించారు.చెళ్ళపిళ్ళ, విశ్వనాథ, జాషువా, కరుణశ్రీ, రాయప్రోలు సుబ్బారావు, అడవి బాపిరాజు, కొండవీటి వెంకటకవి మొదలైన ఎందరో మహనీయులు వీరి సభల్లో పాల్గొన్నారు.వీరిని బహుధా ప్రశంసించారు.జాషువా, కొండవీటి వెంకటకవితో వీరికి ఎక్కువ అనుబంధం ఉండేది.కొండవీటి వెంకటకవిని అన్నా.... అని పిలిచేవాడు. దాన వీర సూర కర్ణ సినిమాలోని సంభాషణలు భాషాపరంగా బాగున్నప్పటికీ, పాండవులను తక్కువగాచేసి మాట్లాడడం, వ్యాస, కవిత్రయ భారతాన్ని సంపూర్ణంగా అనుసరించకపోవడంపై, కొండవీటి వెంకటకవిపై కోప్పడ్డారు కూడా.వారిద్దరి మధ్య అంత చనువు కూడా ఉండేది.బెజవాడ గోపాలరెడ్డి, పి.వి.నరసింహారావుగారు, కోన ప్రభాకరరావు వీరి సభల్లో పాల్గొన్నారు.ముఖ్యంగా, బెజవాడ గోపాలరెడ్డిగారు వీరిని బాగా ప్రోత్సహించారు.గోపాలరెడ్డిగారి తండ్రి పట్టాభిరామారెడ్డిగారు కొప్పరపు సోదరకవులకు అత్యంత ఆత్మీయులు.బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, మద్రాస్ లో కొప్పరపు సోదరకవులతో ఎన్నో సభలు చేయించి ఘనంగా సత్కరించారు.తండ్రి ప్రేరణతో గోపాలరెడ్డిగారు కొప్పరపు కవుల కుమారుడైన సీతారామప్రసాదరాయకవిని ఎంతో వాత్సల్యంగా చూసుకున్నారు.పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అనేక దేవాలయాలలో వీరితో ఎన్నో అవధాన, ఆశుకవిత్వ సభలు చేయించి, ప్రోత్సహించారు. కాసు వెంగళరెడ్డి, బ్రహ్మానందరెడ్డిగారితో సీతారామప్రసాదరావుకు ఎంతో స్నేహం ఉండేది.అక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు, స్వార్ధాలు లేవు.తెలుగు భాషానురక్తియే రక్తసంబంధం కంటే గొప్ప బంధంగా భావించిన తరాల వారసులు వారందరూ. త్వరలో....దొరికిన పద్యాలతో సీతారామప్రసాదరాయకవి, మల్లికార్జునరాయకవి సాహిత్యాన్ని గ్రంథస్థం చేస్తాను. - నమో నమః **** ఇలా.... ఎందరెందరో మహనీయులు జన్మించిన పుణ్యభూమి ఈ ఆంధ్రభూమి- మాశర్మ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి