8, సెప్టెంబర్ 2020, మంగళవారం

పాండవోద్యోగం 5



 *మత్తేభం* జలజాతాసనముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీరపం/
క్తులకెవ్వాని పదాబ్జ
పీఠి, కడు నిగ్గుల్ గూర్చి దత్సన్నిధి/
స్థలిఁ గూర్చుండి భవంబు పావనము గా దైవారగావించి నా/
తొలి జన్మమ్మునఁగూడు పాపముల నాందోళింపగా జేసె దన్.

ప్రతిపదార్ధం
జలజాతము= నీటిలో పుట్టిన కమలము.

ఆసన= దానిలో కూర్చున్నవాడు బ్రహ్మదేవుడు.
 ముఖ్య దైవత= ప్రముఖులైన దేవతలందరూ
 శిరస్సంలగ్న=శిరస్సులను అలంకరిచియున్న
కోటీర=కిరీటముల
పంక్తులకు=వరుసకు
ఎవ్వాని =ఎవరియొక్క
పదాబ్జపీఠి=అబ్జములవంటి(తామరపూలవంటి)పాదపీఠము
కడు=ఎక్కువ, మిక్కిలి
నిగ్గుల్ గూర్చు=శోభనుకలిగి
స్తాయో..
తత్= ఆ యొక్క అటువంటి
 సన్నిధిస్థలి= సమీప ప్రదేశంలో
కూర్చుండి= కూర్చుని
భవంబు= నా యొక్క పుట్టుక,
పావనము గా= పావనమయ్యేటట్లుగా,
 దైవారగావించి= అతిశయించేటట్లుగా,
నాతొలిజన్మమ్మున= నాగతజన్మలోనివి
గూడు పాపముల= నే చేసిన పాపములను కూడా
ఆందోళింపగా= ప్రక్షాళన చేసేటట్లుగా
చేసెదన్= చేసుకుంటాను.
*తాత్పర్యం*gy
బ్రహ్మదేవుడు మొదలైన దేవతా ముఖ్యులు యొక్క శిరస్సుపైఉన్న
కిరీటాలకు, ఎవరియొక్క పాదపీఠివల్ల కాంతులు నింపుతాయో,
అటువంటి వానియొక్క,
శ్రీ కృష్ణునియొక్క సమీపంలో (దగ్గరగా) కూర్చుని నా పుట్టుకను చాలా గొప్పగాపావనంచేసుకోవటమేకాకుండా,, పూర్వజన్మలో చేసినపాపములు
కూడా ప్రక్షాళన చేసుకుంటాను....

**ఆపుదలలు*
జలజాతాసనముఖ్యదైవతశిరస్సంలగ్న
కోటీరపంక్తులకు/
ఎవ్వాని పదాబ్జపీఠి కడునిగ్గుల్ గూర్చు/
తథ్సనిధిస్థలిన్ కూరుచుండి/ భవంబు పావనముగాదైవారగావించి/
నాతొలిజన్మమ్ముల కూడు పాపముల ఆదోళింపగా చేసెదన్....... 💐🙏🏻💐

కామెంట్‌లు లేవు: