8, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఒక ఆదర్శం

ఒక ఆదర్శం చేబూని దానిపట్ల నిష్కామ భావన మరియు భక్తిని కలిగి ఉండటం ఆధ్యాత్మిక జీవనంలో ఒక విశిష్టతను చేకూరుస్తుంది.

నిజమైన శిష్యుడు ఏ విధంగా మెలగవలెనో తెలుసుకోవాలి.

ఈ ప్రపంచం అంతా బోధకులతో నిండి ఉన్నది.

ప్రతీ ఒకరికీ గురువు కావాలనే ఉంటుంది.

కానీ వినయంతో ఒదిగి నేర్చుకునే శిష్యుని గుణం కలిగి ఉండేవారు అరుదుగా ఉంటారు.

అయితే కేవలం శిష్య భావనతో ఉంటే సరిపోదు.

మనల్ని మనం మలుచుకోగలగాలి.

ఏమరుపాటుతో ఉండటం కూడదు.

ఒకసారి పర ధ్యానంలో పడితే తిరిగి మేల్కొనడం కష్టతరం.



*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: