8, సెప్టెంబర్ 2020, మంగళవారం

వీరబ్రహ్మేంద్రస్వామిజీ

వీరబ్రహ్మేంద్రస్వామిజీ చెప్పిన ఆత్మ కథ :
    1.నా పేరు బహురూపవతి అంటే మాయ
    2.నా భర్త పేరు గునశూన్యుడు అంటే పరమాత్మ
    3.నాకు 3 మగ బిడ్డలు అంటే శాంతం, క్షమ, పరోపకారం
    4.నాకు 6 అడబిడ్డలు అంటే కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మొహం.
    5.సప్త సముద్రాలకు ( మూలాధార, స్వాధిష్టాన, మనిపుర, అనహద, విశుద్ద, ఆజ్ఞ, సహస్ర ) అవతల కొండపై కొండలను అధిగమించి రావాలి. పైన 7 వ కొండ(సహస్రచక్రం) ఉంటుంది. నిటారుగాను, నునుపుగాను ఉంటుంది. దానిని ఎవరూ ఎక్కలేరు.
    6.దాని క్రింది భాగాన 2 రెక్కలు(రేచక, పూరకాలు) గల హంసను(ముక్కు) ఎక్కితే అది పైకి తెచ్చి విడుచిపెడుతుంది.
    7.ఆ కొండపైన మధ్య భాగంలో(మాడు - ఋషులు ముడివేసే స్తానం) పచ్చగా ప్రకాశిస్తున్న నా పర్ణశాల ఉంటుంది.
    8.దానిని చేరుకోవాలనే వారికి 4 నదులు(ధర్మం,అర్థం, కామం, మోక్షము) అడ్డంగా వస్తాయి. ఆ నదులను అవలీలగా దాటడానికి నేను 4 (భక్తి, విశ్వాసం,   జ్ఞానం, నామస్మరణ ) వంతెనలను నిర్మించాను. ఆ వంతెనను దాటిన వారు నన్ను చేరుకోగలరు.
*****************

కామెంట్‌లు లేవు: