8, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ధార్మికగీత - 14*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                         
                                      *****
         *శ్లో:- నభసో భూషణం చంద్ర: ౹*
                 *నారీణాం భూషణం పతిః ౹*
                 *పృథివ్యా: భూషణం రాజా ౹*
                 *విద్యా సర్వస్య భూషణమ్ ౹౹*
                                       *****
*భా:- సకల చరాచర సృష్టికి అందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతూ, అంధకారగరిమను తరిమి కొట్టి ఆయాచితంగా వెలుగును ప్రసాదించగల " పున్నమిచంద్రుడు" ఆకాశానికి అలంకారము. సత్త్వరజస్తమో గుణసమాహారరూపిణి, వంశాభివృద్ధికారిణి, సంసార చక్రపాణి, గృహ సచివాలమంత్రిణి అని కీర్తింపబడే నారీమణికి "భర్త"యే అలంకారము. శాసనకర్త, ప్రజాసంక్షేమకర్త, రామరాజ్యస్థాపనా రూపకర్త, సూపరిపాలనావిధానకర్త అయిన "రాజు" పుడమికి అలంకారము. కాని ప్రతివారిచే మూడవ నేత్రంగా కొనియాడబడుతూ, జీవితలక్ష్యాన్ని నిర్దేశిస్తూ, అర్థాన్ని,పరమార్థాన్ని చేకూర్చగల "చదువు" అందరికి అలంకారమే. చంద్రుడు పగలు రాణించలేదు. భర్త సాధికారికత తన భార్యకే పరిమితము. రాజుకు పరదేశంలో గౌరవం పరిమితమే. కాని విద్వాంసుడు అంతటా పూజింపబడతాడు. సన్మానాలు, సత్కారాలు అందుకుంటాడు. కాన విద్యా ఆభరణం అంత గొప్పదని భావము*.
                                  *****
                    *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: