8, సెప్టెంబర్ 2020, మంగళవారం

రామాయణమ్. 55

రామాయణమ్. 55
...
లక్ష్మణా నీవన్నట్లుగా ఈ పట్టాభిషేకము జరిగినదే అనుకో !
అప్పుడది ఎవరికి అవమానము?
మన తండ్రికి !
ఎవరికి మనస్తాపము ?
మన తల్లి కైకకు !
మన తండ్రికి గానీ తల్లులకు గానీఇంతకు మునుపెన్నడైనా లేశమైనా అప్రియము చేసినట్లు నాకు గుర్తులేదు .
.
 మన తల్లి తండ్రులు ఎట్టి భీతి,మనస్తాపము లేక జీవింతురుగాక.నా తండ్రి అసత్యవాది అన్నపేరు ఎవరికి బాధ ! చివరకు అది మనకే బాధ!
.
తల్లితండ్రులకు కలిగిన మనస్తాపము మనకు కలిగినట్లే!.ఈ కారణము చేతనే నేను అడవులకు వెళ్ళటానికి నిశ్చయించుకొన్నాను. ఇచ్చిన రాజ్యము తీసుకొన్నది తండ్రిగాదు,తల్లికైకకాదు!.....
.... ఇది దైవనిర్ణయము!
.
నాకు నా తల్లులపట్ల ఏవిధమైన భేద భావమూలేదు!
.
లక్ష్మణా దైవము నడిపించునట్లు నడవడమే తప్ప దానిని నిగ్రహించుటకు ఏ ఉపాయమూ కానరాదు!.
.
లక్ష్మణా ! నా వనవాసవ్రతమునకు ఈ అభిషేక జలములతో స్నానము చేసెదను ! ఉహూ ! వద్దులే ఇవి రాజద్రవ్యములు ! అందుకు వాడరాదు!
.
( మన రాజకీయనాయకులు పిల్లాజల్లా సహా అందరూ అధికార లాంఛనాలకోసం, ఎర్రబుగ్గకార్లకోసం వెంపర్లాడే వారే ! Special treatment గుళ్ళలో కూడా కావాలని నానా అల్లరి చేసే వారే! . .........రాముడు నీళ్ళను కూడా వాడలేదు!)..
.
రాజ్యమా ?వనవాసమా ?
వనవాసమే సుఖప్రదము ! శుభప్రదము! .
రాజ్యం వా వనవాసో వా ! వనవాసో మహోదయః!
.
రాముడి ఈ మాటలు వింటున్న లక్ష్మణుడు ఇంకా బుసలుకొడుతూనే ఉన్నాడు ! కనుబొమ్మలు విరిచి చూడటానికే భయంకరంగా ఉన్న ఆయన రూపము బాగా కోపంతో ఉన్నసింహపు ముఖంలాగా ఉన్నదట.
.
నేత్రాగ్రాలతో రాముడిని అడ్డంగా చూస్తూ ! అన్నా! సుక్షత్రియుడవు,మహావీరుడవు! నీవు కన్నెర్రచేస్తే లోకాలే గజగజవణికిపోతాయి! .
.
పాపాత్ముడయిన రాజు ,ఆయన భార్యకైకమీద నీకు కోపం ఎందుకు కలుగటలేదు ! పైగా దైవనిర్ణయం అంటున్నావు ! నీ సంకల్పము బలవత్తరమైనదయితే దైవము బలహీనము కాదా?.
.
వారిది వంచన ! అది ధర్మరూపాన్ని సంతరించుకొన్నది!
..
 ఎప్పుడో ఇచ్చిన వరము అప్పుడే తీర్చక నేడిలా నిన్ను మోసం చేయటానికి దానిని ఏల సాకుగా చూపవలే!.
.
నీ రాజ్యము నీకు కాకుండా చేసిన ఈ ధర్మమును నేను ద్వేషిస్తున్నాను!
.
మనోధైర్యము,వీర్యము లేనివాడు మాత్రమే దైవముపై ఆధారపడి యుండును నీ వంటి వీరుడు కాదు!.
.
దైవమట దైవము !
నా కెవరు అడ్డువస్తారో చూస్తాను!
నీవుకాదు అడవులకు వెళ్ళవలసినది !
.. వారు !.
.
అన్నా నా ఈ బలమైనబాహువులు కేవలము జనులు వీక్షించడానికి కాదు!
ధనుస్సు అలంకారము కొరకు కాదు ,
ఖడ్గము నడుముకు వేళ్ళాడదీయటానికి కాదు!
బాణములు అలా వృధాగా పడి ఉండటానికి కాదు!.
 ఈ నాలుగూ శత్రువులను సమూలంగా నిర్మూలించడానికే.
.
క్షణకాలంలో గజ,తురగ,పదాతిదళముల పీనుగులపెంటగా మార్చివేస్తాను ఈ అయోధ్యను!
అడ్డువచ్చినవారిని కత్తికొకకండగా నరికివేస్తాను !
దశరధుని నేడే సింహాసనం నుండి క్రిందకు దించివేస్తాను! .
.
బుసలుకొడుతూ తిరుగుబాటుకు సిద్ధమైన తమ్ముని కన్నీరు తుడిచి ,
లక్ష్మణా! నాన్నమాట నాకు బంగారు బాట !
ఆయన మాట మీదనే నేను స్థిరంగా నిలిచి ఉన్నాను .
ఇంక వ్యర్ధవాదములు వద్దు!.
అని శాంతగంభీరంగా పలికిన రాముని చూచి కౌసల్య ...ఇలా అన్నది!.

.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: