రచన
గోపాలుని మధుసూదన రావు
వలదు గర్వంబు ధనజన యౌవనమున
సర్వమును కాలము హరించు క్షణము నందు
మాయరూపంబు యిదియని మదిని దలచి
బ్రహ్మపదమున తరియించు బడసినీవు 11
ధాత్రి నుదయ సాయంత్రముల్ రాత్రి పగలు
శిశిర వాసంత ఋతువులు చేరు మరల
కాలమనయంబు క్రీడించు గడచు వయసు
అయిన వీడడు మనుజుండు యాశ నెపుడు 12
ఇంతి ధనముల గూర్చిన చింతయేల ?
అరయ పరమాత్మ లేడె నిన్నాదుకొనగ
జగతి " సజ్జనసంగతే " , జనుల నెల్ల
బయటపడవేయు " భవసంద్ర " బాధనుండి 13
ఉంచితంబైన కేశాల నుండు నొకడు
గుండు కాషాయ వసనాల నుండునొకడు
సర్వమెరిగియు , నెరుగక సత్యపథము
ఉదరపోషణ కొఱకునై నుందు రవని 14
వడలె యంగంబులెల్లను వణికె తనువు
పండె కేశంబు లెల్లను పడెను పళ్ళు
చేరె దండంబు యండగా చేతి కకట
యైన నరునకు చావదు యాశ యపుడు. 15
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి