23, సెప్టెంబర్ 2020, బుధవారం

*ఇది కథ కాదు

 *శ్రీ నృసింహ సేవా వాహిణి*


*ఇది కథ కాదు యదార్థ సంఘటన మన నృసింహ సేవా వాహిణి సభ్యుడి యదార్థ ఘటన*


*"రెండు కిలోల ఆశీర్వాద్ , రాగి పిండి ప్యాక్ చేయండి...’’ అని కిరాణా షాప్ లో బిల్ పే చేయబోతుంటే...*

 

*"అన్నా కిలో బియ్యం ఎంత...?’’ అని అడుగుతోంది ముక్కుకు చెంగు చుట్టుకున్న అమ్మాయి. పాతికేళ్లు ఉండచ్చు... కాళ్లకు చెప్పులు లేవు. చేతిలో చిన్న సంచి...*


*"నువ్వు కొనలేవులే ఎల్లమ్మా...’’ అని విసుక్కున్నాడు. షాపతను.*


*"ఎక్కడుంటావమ్మా...?’’ అని అడిగాను.*

 

*"యూసఫ్ గూడ బస్తీలో అన్నా... పనిపోయింది. పైసలు లేవు.. ఇరవై రూపాయలే ఉన్నయి... రెండు రోజుల నుండి బ్రెడ్ తింటున్నాం..’’ అన్నది. ఇంకా వివరాలు అడగాలనిపించ లేదు.*


*"నీకేం కావాలో తీసుకోమ్మా...’’ అని షాపతను వైపు తిరిగి ఆమె బిల్లు కూడా నా దాంట్లో కలిపేయి.. అన్నాను.*


*"కిలో బియ్యం , కొంచెం కందిపప్పు చాలన్నా ..’’ అంది, ఆమె అమాయకంగా...*


 *ఉచితంగా తీసుకోవడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డువస్తున్నట్టు అనిపించింది.*


*"నెలకు సరిపడా సరుకులు తీసుకొని వెళ్లమ్మా... ఇపుడు నేను పైసలు ఇస్తా... నీకు పని దొరికినపుడు, నాకు తిరిగి ఇయ్యి... ఈ షాపుతనకి నా వివరాలు తెలుసు. ’’ అని ఆమెకు కావాల్సినవి ప్యాక్ చేయించి ఆటో ఎక్కించి పంపాక,*

 

*"అమె మళ్లా ఇస్తాదంటారా సార్...?’’ అన్నాడు షాపతను.*


 *‘‘అమె ఇస్తుందా, లేదా వేరే సంగతి, మనం ఉచితంగా సాయం చేసినట్టు అమె ఫీల్ కాకూడదు. కష్ట జీవులకు ఆత్మాభిమానం ఎక్కువ. దానిని గౌరవించాలి.’’ అని, మొత్తం బిల్ పే చేశాను.*

 *షాపతను, రెండువందలు తిరిగి ఇచ్చాడు!!*


*"మీరు అంత చేసినపుడు, నేను కూడా కొంత చేయాలి కదా... వ్యాపారంలో పడిపోయి, ఏదో మిస్ అవుతున్నట్టుంది సార్.. ఇపుడు మనసుకు ఎంతో హాయిగా ఉంది..’’ అని నాకిష్టమైన లిమ్కా బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు......*🙏🙏🙏


*ఎవరో మారలేదు అని అనుకునే బదులు..ఆ మార్పు అనే ముందు అడుగు మనమే వేస్తే సరిపోతుంది* 🙏🙏


*ఇలాంటి ఎందరో పేదవాళ్లకు కరోనా కష్ట కాలంలో* *నిత్యావసర వస్తువులు నృసింహ సేవా వాహిణి ద్వారా మన భక్తుల సహకారంతో అందించాము* *అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది*


*కష్టంలో ఉన్న మానవుడికి సేవ చేస్తే తప్పక మాధవుడు శంతోషిస్తాడు*


*శ్రీ నృసింహ కార్యంలో శ్రీ నృసింహ సేవా వాహిణి*

#6305811889#

కామెంట్‌లు లేవు: