23, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీ పాదరాజ కరావలంబ స్తోత్రం

 

1. అనఘాసహితఅనశ్వరచారిత్ర్యకీర్తిం

త్రిమూర్త్యాత్మకత్రిజగన్నుతదిగంబరరూపం

సంగీతసాహిత్యసారస్వతప్రదభవ్యరూపం

శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||


2. భజే ఇందుశీతలాకుందమందారహాసం

భజే బృహద్భావనాగమ్యచారుప్రకాశం

భజే విశ్వవ్యాప్తబ్రహ్మజ్ఞానప్రబోధతత్త్వం

శ్రీ పాదరాజ  మమ దేహి కరావలంబం ||





3. భావాతీతనిర్గుణాత్మకతరం 

బ్రహ్మానందసంతతధ్యానపరం

సర్వేజనాఃఅజ్ఞానదాహకవరం

శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||


4. జగద్విఖ్యాతఅనఘాద్భుతచారిత్ర్యకీర్తిం

 అలౌకికానందపదమహిమాన్వితపాదపీఠం

 విద్యుత్కోటిప్రభాసమానదివ్యసుందరవిగ్రహం

 శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||


5. సంతతమత్తచిత్తబ్రహ్మసమాధిస్థితపరాత్పరతరం

బ్రహ్మేంద్రాదిసురసేవితమృదుపల్లవపాదపద్మయుగం

సంగీతసాహిత్యసారస్వతజ్ఞానప్రదభవ్యదిగంబరతత్త్వం

శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||

శ్రీ పాదరాజ దివ్యచరణారవిందార్పణమస్తు

కామెంట్‌లు లేవు: