23, సెప్టెంబర్ 2020, బుధవారం

భగవంతుడు

 రాత్రి పూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి.సూర్యోదయం అయిన తర్వాత అవి కనపడవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పగలమా? మానవుడా! అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుగొన లేకపోయినా అందువల్ల భగవంతుడు లేడని నిర్ణయించుకోవద్దు..

రెండు రకాల సంస్కారాల తో మానవుడు ఈ లోకంలో జన్మిస్తున్నాడు. 

అందులో ఒకటి ముముక్షు హేతువైన "విద్య"..

రెండవది సంసార బంధ హేతువైన "అవిద్య "..

మానవుని జనన కాలంలో ఇవి రెండు త్రాసులోని సిబ్బుల మాదిరి సరిసమానంగా ఉంటాయని చెప్పవచ్చు.

సంసారం, లౌకిక సుఖాలను-ఒక సిబ్బిలో, దైవం,దైవ జిజ్ఞాస అనేవి రెండవ సిబ్బిలో,ఉదయింప చేస్తాయి.

మనసు సంసారాన్ని కోరుకుంటే అవిద్య అనే సిబ్బి బరువై 

మానవుడు లోకం వైపు మొగ్గుతాడు.

అలాకాక దేవుని కోరుకుంటే విద్య అనే సిబ్బి బరువై అతన్ని దేవుడి వైపు మరలుస్తుంది.

కామెంట్‌లు లేవు: