23, సెప్టెంబర్ 2020, బుధవారం

**ఆత్మ బోధ**

 **దశిక రాము**


**ఆది శంకరాచార్యుల వారి**




65 సర్వగం సచ్చిదాత్మానం


జ్ఞాన చక్షుర్నిరీక్షతే


అజ్ఞాన చక్షుర్నేక్షేత


భాస్వంతం భానుమంధవత్‌ || 65


xqsLRi*gRiLi = అంతటా ఉన్నటువంటి, సత్‌ + చిత్‌ + ఆత్మానం = సచ్చిదానందమయమైన ఆత్మను, జ్ఞాన చక్షుః = జ్ఞానమనే నేత్రాలే, నిరీక్షతే = చూస్తాయి, భాస్వంతం = ప్రకాశవంతంగా వెలుగొందేటటువంటి, భానుం = సూర్యుణ్ణి, అంధవత్‌ = గుడ్డివాడు ఏ విధంగా చూడలేడో ఆ విధంగా, అజ్ఞాన చక్షుః = ఆత్మజ్ఞానం లేకపోవటంచేత ఆతని కళ్ళు, న ఈక్షతే = చూడలేవు.


తా|| అంతటా ఉన్నటువంటి సచ్చిదానందమైన ఆత్మను జ్ఞాననేత్రాలే చూస్తాయి. ప్రకాశమానమైన సూర్యుణ్ణి గుడ్డివాడు ఏ విధంగా చూడలేడో ఆ విధంగానే ఆత్మజ్ఞానం లేని వాని కళ్ళకు ఆత్మ కనిపించదు.


వివరణ :- ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా చూసేవాడి దృక్కోణాన్నిబట్టే అవి అర్థం అవుతాయి. చూసేవాడికి ఆత్మజ్ఞానం ఉంటే కనిపించేవన్నీ బ్రహ్మంగా కనిపిస్తాయి. బ్రహ్మజ్ఞానం లేనివానికి అన్నీ నామరూపాలతోనే సృష్టి అంతా జగదాకారంగా కనిపిస్తాయి. అంధత్వానికి గల కారణం తొలగగానే అంధుడు సూర్యుణ్ణి చూసినట్లు అజ్ఞానం తొలగగానే అజ్ఞాని కూడా ఆత్మను దర్శించగలుగుతాడు. జ్ఞాననేత్రమంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే పేరుమీదుగా నాలుగురకాలుగా పనిచేస్తున్న మనస్సు ఏకమై అది ఆత్మలో గురుజ్ఞానంతో లీనమవటమే. ఆ విధంగా లీనమవటానికి సాధకునికి గురుజ్ఞానం లభించిన తర్వాత అది జరుగుతుంది. దానితో ఆతనికి అంధకారం తొలుగుతుంది. ఆతడు క్రమేపి బ్రహ్మానందంలో లీనమవుతాడు. గురుజ్ఞానంవల్ల సాధకుడు మరచిపోయిన ఆత్మను తెలుసుకొని ధ్యానం ద్వారా తానే బ్రహ్మాన్నని తెలుసుకొంటాడు. బ్రహ్మం అనేది విషయం కాకపోవటం వల్ల బ్రహ్మం అందరికీ తెలియటం లేదు. తెలుసుకొనేవాడు బ్రహ్మానికి వేరుగా లేడు కాన ఆత్మజ్ఞానం తెలిస్తే గాని అజ్ఞానికి బ్రహ్మం గోచరంకాదు. బ్రహ్మం వస్తు రూపంలో కనిపించదుగదా! బ్రహ్మం శుద్ధ చైతన్యం కదా ! శుద్ధచైతన్యం ఎవరికి తెలుస్తుంది ? ఆత్మజ్ఞానమనే జ్ఞాననేత్రం లభించినవారికి మాత్రమే ఆ శుద్ధచైతన్యం తెలుస్తుంది. కనుక జ్ఞానులకు గురుకృపవల్ల ఆ ఎరుక కలుగుతుంది. సాధకుడు గురుకటాక్షంవల్ల సాధనలో తన సహజ స్వరూపమైన ఆత్మను జ్ఞప్తికి తెచ్చుకొని తన సహజ స్వరూపాన్ని అనుభూతి పొందుతాడు. సామాన్య మానవుడు ఆత్మజ్ఞానం తెలియకపోవటం వల్ల అంధునివలె విషయవాంఛలతోనే సుఖాన్ని వెతుకుతూ సచ్చిదానందంలేదని భ్రమపడతాడు. సామాన్యమానవుడు సూర్యుని చూడలేని గుడ్డివాని వంటి వాడే కాని మరొకటి కాదు కారణమేమిటంటే ఆతడు అనుభవజ్ఞులైన జ్ఞానులమాట వినటంలేదు. ఒకవేళ విన్నా, విన్నదాన్ని ఆచరించి సాధనకు ఓర్చి, నిజాన్ని నిగ్గుతేల్చుకోవటానికి నమ్మకం, విశ్వాసం, పట్టుదల, లక్ష్యసాధనయందు నిరంతర కృషి కలిగి ఉండటంలేదు. అటువంటి లోపాల్ని సామాన్య మానవుడు గ్రహించలేకపోవటం వల్ల సచ్చిదానందాన్ని పొందలేకపోతున్నాడు. ఎదురు, ఆతడు సచ్చిదానందమైన ఆత్మేలేదని నిందిస్తున్నాడు. దానికి దేవాలయానికి గల ప్రతీకల్ని పరిశీలిద్దాము. అప్పుడు జ్ఞాననేత్రాన్ని గురించి తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది. సంఘంలో ఎక్కువగా మానవులందరూ భక్తి మార్గంలోనే సంచరిస్తుంటారు. ఎక్కువమంది దేవాలయానికి వెళ్ళి పూజచేసుకొని వస్తూ పవిత్రులమయ్యామని భావిస్తుంటారు. ఆ విధమైన పవిత్రత చేకూరటమే ప్రతి మానవునికి కావలసింది. అందుకోసమే పూర్వులు ఆగమ శాస్త్రాన్ని అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రాన్ని ఆత్మజ్ఞానానికి అనుకూలంగానే ఏర్పరచి దేవాలయాలను నిర్మింప చేశారు. కానీ సామాన్య మానవులందరికీ అది తెలియకపోవటం వల్ల సాకార పూజా విధానంలోనే తృప్తిపొంది అంతర్ముఖం అవ్వటం గురించి ఆలోచన చేయలేకపోతున్నారు. భగవంతుని దేవాలయానికి ఆత్మతో కూడి ఉన్న మానవ దేవాలయానికీ ఉన్న సామీప్య సాదృశ్యాలను ఈ కింద పోల్చి వివరించి చూపిస్తాను. నిజానికి పంచేంద్రియ నిగ్రహాన్ని కొనసాగిస్తూ ఆలయంలో అర్చన కొనసాగించటాన్నే పూజవిధానం అంటున్నాము. దాన్ని ఆ విధంగా అందరూ తెలుసుకొనేటట్లు జ్ఞానులైనవాళ్ళందరూ పూనుకొని అందరికీ తెలియజేయాలి.


దేవాలయం ఆత్మతో కూడిన శరీరమనే దేవాలయం


1. గుడి గోపురం ఎత్తుగా కనిపిస్తుంది. 1. మానవుని తల ఉన్నతంగా ఎత్తుగా పైన ; ; ఉంటుంది.


2. గుడిపైన బొమ్మలు చెక్కి ఉంటాయి. 2. లోపల మానసికంగా భద్రపరిచిన ; ; చిత్రాలుంటాయని తెలియజేస్తుంది.


3. బూతు బొమ్మలు చెక్కి ఉంటాయి. 3. మనస్సులో కదిలే దుష్ట సంకల్పాలను ; ; విడిచి ముందుకు వెళ్ళాలని సూచించటం ; ; జరుగుతుంది.


4. బొమ్మల్ని విస్మరించి లోనికి వెళ్ళాలి. 4. మానసిక సంకల్పాలను అధిగమించి ; ; కామాదులే ప్రధానం కాదని, వాటిని విడిచి అంతర్ముఖం కావాలని గ్రహించటం జరుగుతుంది.


5. బలిపీఠం వద్ద సాష్టాంగ నమస్కారం 5. అంతర్ముఖమైన ఆత్మజ్ఞాని అహంకారాన్ని చేయాలి. బలి ఇచ్చి ఆత్మకు సంపూర్ణ శరణాగతుడవటం జరుగుతుంది.


6. ధ్వజస్తంభాన్ని, దాని మీద 6. ఆత్మ అనే హృదయ మందిరంలో


ఉన్న పతాకాన్ని దర్శిస్తాడు. ప్రవేశించే హక్కును గ్రహిస్తాడు. ఆ


ద్వారం ఒక్కరికే ప్రవేశాన్ని ఇస్తుంది. అది శరీరానికి ప్రవేశాన్ని ఇవ్వదు. ఆత్మకు మాత్రమే అది ప్రవేశాన్ని ఇస్తుంది. అంతఃకరణ చతుష్టయం లయించిననాడు ఆత్మకు భగవన్మందిరంలో ప్రవేశం లభిస్తుంది. ఆ ద్వారాన్ని తెరిచే తాళం చెవి నా వద్ద ఉందని గురు మహారాజ్‌జీ అంటూ ఉంటారు.


7. వాహనమూర్తిని దర్శిస్తాడు. 7. సాధకుడు ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి వాహనమూర్తి వలె ఆత్మ అనే భగవంతుని మోయాలని తెలుసు కొంటాడు.


8. వాహనమూర్తికి భగవంతునికి 8. భక్తుడు ఏ మార్గంలో నడుస్తున్నా

మధ్య నిలబడ కూడదు. ; ; భక్తునికి భగవంతునికి మధ్య జ్ఞానికూడా 9; 9; నిలబడకూడదు. ఆత్మప్రబోధం మాత్రమే

చేయాలి. ఆ భక్తునికి ఆ సంస్కారం ఉంటే

ఆత్మజ్ఞానానికి ఆతడే అంది వస్తాడని 9; 9; తెలుసుకొంటాడు.


9. గర్భాలయంలో ప్రవేశం అంతా 9. హృదయ గుహ చెంత అవిద్య ఆవరించి

చీకటిమయంగా ఉంటుంది. అంతా చీకటిమయంగా ఉంటుంది.


10. కొంతకాలం నిలబడితే తెర 10. కొంతకాలం అక్కడే వేచిఉండగా సాధన

తొలగుతుంది. కొనసాగుతుంది. అజ్ఞానపుతెర తొలగు

తుంది.


11. గంటలు మ్రోగుతాయి. 11. అనహద (అనాహత) శబ్దమనే #9; #9; గంటానాదం వినబడుతుంది.


12. నీరాజనం ఇవ్వబడు తుంది. 12. జ్ఞానప్రకాశమనే నీరాజనం ప్రకాశిస్తుంది.


13. సాకారమైన దైవదర్శనం 13. ప్రకాశవంతమైన వెలుగులో. #9; #9; జరుగుతుంది. #9; #9; ఆత్మదర్శనం జరుగుతుంది.


14. భగవంతుని ముందు నేత్రాలు 14. కళ్ళతో తపనపడుతూ బాహిరంగా

మూసుకొని సంపూ ర్ణంగా #9; #9; దర్శించవలసినవి లేవని తెలుసుకొని

తనలో తాను లీన మవుతాడు. #9; #9; లోకకాంక్షలు తొలగించుకొని #9; #9; అంతర్ముఖంగా నిలవ గలుగుతాడు.


15. చేతులు జోడించి హృదయ 15. జీవుడు బ్రహ్మ ఐక్యమై జీవాత్మగా #9; #9; స్థానం చెంత ఉంచుకొని అనగా ఆత్మ బ్రహ్మగా నిలుస్తాడు.

నమస్కరిస్తాడు.


16. కన్నులకు భగవంతుని దర్శనం 16. ఆత్మ అనే భగవంతుని తప్ప అన్యవస్తు

తప్ప మరొక దృశ్యం కనిపించదు. దర్శనం అవాంఛనీయమని తెలుస్తుంది.

దృగింద్రియ (కళ్ళు) నిగ్రహం జరుగుతుంది.


17. మంత్రాలు, ఘంటానాదాలు 17. భగవత్సంబంధమైన విషయాన్నే

వినిపిస్తాయి. ఆలకించాలి అనే భావన స్ఫురిస్తుంది.

శోత్రేంద్రియ (చెవులు) నిగ్రహం జరుగుతుంది.


18. పువ్వులు, సుగంధాలు 18. లోపల చోటుచేసుకొన్న సమస్తమైన

విరజిమ్మే వాసనలు ఆవరిస్తాయి. పూర్వవాసనలను భగవంతుని పాదాలచెంత సమర్పించాలనే అంతరార్థం స్ఫురిస్తుంది. ఘ్రాణంద్రియ

(ముక్కు) నిగ్రహం జరుగుతుంది.


19. తీర్థప్రసాదాలు స్వీకరిస్తాడు. 19. ఆత్మ ప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా

ప్రసాద బుద్ధిని ఏర్పరుచుకొంటాడు. రసనేంద్రియ (నాలుక)నిగ్రహం జరుగుతుంది.


20. చందన భస్మాదులు 20. ఆత్మ స్పర్శద్వారా భగవద్భక్తిని

పూసుకోవటం, చెవిలో పూవులు హృదయంలో నింపుకోవటం పెట్టుకోవటం జరుగుతుంది. త్వగింద్రియ (చర్మం) నిగ్రహం జరుగుతుంది.


21. బయటకు వచ్చిన తర్వాత 21. ఆత్మ దర్శనం తర్వాత ఆత్మస్థితుడై

ఒకచోట కూర్చొని, కళ్ళు ఆత్మానందం అనుభవిస్తూ అంతర్ముఖుడై

మూసుకొని, ధ్యానమగ్నుడై ఉండాలనే అంతరార్థాన్ని గ్రహిస్తాడు. 

ప్రశాంతచిత్తంతో లేచి వస్తాడు. కార్యాలు ఆచరిస్తున్నా బ్రహ్మభావంతో సాక్షిమాత్రంగా జీవించటం అలవర్చు కొంటాడు


ఈ విధంగా చూస్తే భక్తుడు ఆలయంలో ప్రవేశించి బయటకు వచ్చేవరకూ ఆతడు చేసే ప్రతి పనీ కూడా భగవంతుడైన అనంత చైతన్యంలో లీనమవటానికి కావలసిన ప్రతీకలుగా స్వీకరించి ఆచరించేటట్లు చేయిస్తున్నారని తెలుస్తుంది.


పరమహంస యోగానంద ఆత్మకథ అయిన ఒక యోగి ఆత్మకథలో ఒక యోగి రెండురూపాలు ధరించటాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవటానికి పరమహంస యోగానంద బయలుదేరి వెళ్తున్నప్పుడు దారిలో కనిపించిన ఆలయ విగ్రహానికి ఎందుకు నమస్కారం పెట్టాలి ? మనలోనే ఆత్మ ఉంది కదా అని అనుకొని దేవునికి నమస్కారం పెట్టకుండా ముందుకు సాగిపోతాడు. ఆయన దర్శించాలనుకొంటున్న రెండు రూపాల్లో కనిపించే ఆ యోగియే ఆయనకు దారిలో కనిపించి నువ్వు ఆలయాన్ని ఆ విధంగా తృణీకరించి వెళ్ళినందువల్లే నువ్వు దారి తప్పావు అని హితబోధ చేస్తాడు. నిరాకారంతో జీవిస్తున్నా సాకారమైన భగవంతుని, సాకార సాధకుల్ని తృణీకరించి విస్మరించి నడవకూడదని తెలియచేస్తాడు. సాధకుడు తన రూపమైన సాకారంనుంచే నిరాకారమైన తన ఆత్మవద్దకు చేరి ఆత్మ అనే బ్రహ్మంగా నిలవాలి. సాధకుడు బ్రహ్మం కావటానికి పూర్వం ఎట్లా ఉన్నాడో బ్రహ్మం అయిన తర్వాత కూడా అట్లాగే ఉన్నాడు. అద్వైతంలో గ్రహించవలసిన అతి సూక్ష్మ రహస్యమిదే. ఆత్మజ్ఞానం తెలియని వారికి, ఆత్మతో జీవించని వారికి, విగ్రహారాధకులకు తెలియని దాన్ని ఒక్కసారిగా ఎవ్వరూ నిరూపించి చూపించలేరుకదా! దాని వల్ల ఆత్మజ్ఞాని కూడా బాహిరమైన పూజలుకాదు చేయవలసింది ఆంతరికమైన అర్చనలు చేయాలని తెలిసి సాధనలో జీవించాలి. అంతేగాని అర్చనలను, దేవాలయాలను తూష్ణీభావంతో చూడకూడదు. ఆత్మజ్ఞానికి కూడా పక్వస్థితినొందిన భక్తి కావాలి. అదే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఆచరించి చూపించారు. వాళ్ళు ఆత్మతోనే జీవిస్తూ పైకి భక్తులులాగా నిలిచారు. జ్ఞానికి ఏ పూజలు అవసరంలేదు. కాని హృదయరాముని పూజించటం, ప్రేమించటం, కావాలి. హృదయమే తానై తరించాలి.


ఈ శరీరం నిజంగా ఉత్తమమైన దేవాలయం. దాన్ని శుభ్రపరిచి, దాన్ని భద్రపరిచి దానిలో ప్రవేశించి ఆనందాన్ని పొందాలి. ఈ శరీరంలో అమూల్యమైన రత్నాలున్నాయి. దానికి కావలసిన ప్రయత్నాన్ని, శక్తిని ఇచ్చే గురువు కూడా తానే అయి లోపలే ఉన్నాడు. ఆయనే ఆయనను చేరటానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే బాహిరమైన గురుదేవుని చెంతకు కూడా చేరుస్తాడు. ''గురువు తానే, సాక్షాత్కరించేది తానే గురుమూలంగా శబ్దాన్ని ఇచ్చి అనుగ్రహించేది కూడా తానే'' అని సిక్కుల ఆది గ్రంథంలో చెప్పబడి ఉంది. దానికే బుల్లేషా అనే గురువు ''నేను బాహిరమైన దేవాలయాల్లో ప్రవేశించినంత కాలం నా మనస్సులో భీతే నిలిచిపోయింది. అంతర్ముఖం అయి ఆయనను ఆరాధించి, ఆయనకోసం ప్రేమతో నిత్యం అంతర్ముఖంగా వెతికిననాడు నాదాలు వినిపించాయి. ఆయన దర్శనం లభించింది, ఆయనతో ఆనందించటం కుదిరింది. భీతి తొలగింది, ధైర్యం చేకూరింది. సుఖశాంతులు లభించాయి'' అని చెప్పాడు. కబీరు కూడా ''ఈ శరీరమనే మట్టి పాత్రలో ఉన్న అంధకారంలోనే సృష్టికర్త అయిన భగవంతుడు ఉన్నాడు'' అని చెప్పాడు. . మరి ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రబోధిస్తున్నా మానవులందరూ ఎందుకు బయట వెతుకుతున్నారంటే సాకారంతో తృప్తిపడి తమ బాధ్యతను ఆ భగవంతుని మీద పడవేసి తాము తేలిగ్గా సుఖశాంతులతో గడపగలమనే భ్రమతో జీవిస్తున్నారు. మానవుని బాధ్యత ఏదో మానవుడు తెలుసుకోకుండా నడవటానికే మానవుడు ఈ విధంగా సంచరిస్తున్నాడని ఎవరికి వారికి తెలియక పోవటం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. ఆ విషయాన్నేఅనేకమంది మహాపురుషులు, అనేక గ్రంథాలు తెలియజేస్తున్నా నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. బాహిరమైన సుఖాకాంక్షతో బాల్యం అంతా ఆటల్లో గడుపుతున్నాడు, ¸°వనం అంతా కామపిపాసతో, పశుప్రవృత్తితో గడుపుతున్నాడు, వయస్సు మళ్ళే సమయానికి సంసార బాధ్యతలతో సతమతమై గడుపుతున్నాడు. పళ్ళు ఊడే సమయానికి ఎవరూ తనను లక్ష్యపెట్టనిస్థితిలో ఆ పరాత్పరుడే దిక్కని వెతకటానికి పూనుకొంటున్నాడు. అప్పుడు కూడా అంతర్ముఖం అవటానికి, సజీవ గురువును వెతుక్కోవటానికి పూనుకొంటున్నాడు. దానితో పుణ్యకాలమంతా దేవులాటల్లోనే జరిగిపోతుంది. కాన తెలిసిన జ్ఞానంతో, జ్ఞాన మార్గంలో జీవించటానికి మానవులందరూ ప్రయత్నంచేసి నేర్చుకోవాలి.


ఆధ్యాత్మిక శాస్త్రంలో పరిశోధనలు జరిపిన మహాత్ములందరూ కూడా మానవుడు ప్రత్యక్షంగా చూస్తున్న ప్రపంచం, దాని వెనక చూడటానికి వీలులేకుండా ఉన్న ఇతర లోకాలు అన్నీ కూడా ఈ శరీరంలోనే ఉన్నాయని, మానవుడు అంతర్ముఖం అయి పరబ్రహ్మం అయిన ఆత్మ అనే ఆ పరమేశ్వరుని చేరిననాడు ఆయన సృష్టించిన అణువణువుని పరికించి, తనివితీరా చూడటం సాధ్యమవుతుందని చెబుతున్నారు.అదే ఈశ్వరాలయమైన మానవదేహంలో ఉన్న ఔన్నత్యం అనే దాన్ని అందరూ గ్రహించి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. మానవులు ఈ శరీరమనే దేవాలయంలో ఉన్న రత్నాలను పొందలేక మేము దరిద్రులమని బాధలను అనుభవిస్తున్నారు.


ఈ శరీరంలో ఉన్న నవద్వారాలైన రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, కింది భాగంలో ఉన్న రెండు మలద్వారాలు అన్నీకూడా మానవుని ధ్యాసను, మానవుని దృష్టిని బాహ్య ప్రపంచంలోకి తీసుకుపోతున్నాయి. అట్లా బాహిరంగా పోకుండా వాటన్నిటినీ అంతర్ముఖం చేసి వాటిని మూడవ కన్ను దగ్గరకు తీసుకురావటానికే ఆత్మ మార్గంలో సాధకుడు సాధన చేస్తున్నాడు.ఆ స్థానాన్నే యోగ మార్గంలో ఆజ్ఞాచక్రం అన్నారు. సిక్కులు తీస్రతిల్‌ అన్నారు. భారతీయులు శివనేత్రం అన్నారు. కావున ఆపదవ ద్వారాన్ని తెరవటానికే గురువు కావలసి వస్తున్నాడు. ఆ పదవ ద్వారం భగవంతుడు నివాసం చేస్తున్న వైపుకు తెరుచుకొని ఉంది. కాన ఆ మూడవ నేత్రం దగ్గరకు చేరటానికి ప్రతి మానవుడు ఆత్మజ్ఞానంతో, ఆత్మమార్గంలో నిరంతరం సాధన చేసి, జీవించి ఉండగానే సుఖశాంతుల్ని అనుభవించాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదు చేయవలసింది. తెలివి ఉండగానే చేతులు కాలకుండా చూసుకొని, ఆకులు పట్టుకోకుండానే ఆ ఆధ్యాత్మిక అగ్నిగుండంలో ఇనుపగుండు ప్రవేశిస్తున్నట్లు గురుజ్ఞానంతో ప్రవేశించి బ్రహ్మంగా రూపొందటం నేర్చుకోవాలి. మానవుడు మరణించే స్థితిలో కూడా ఆత్మజ్ఞానంతో భృకుటి మధ్య నిలిచిననాడు ఈ ప్రపంచానికి సంబంధించినంతవరకూ మరణించినవాడయినప్పటికీ అంతర్గతంలో పూర్తిగా జాగృతితో ఉంటాడు. కాన మానవుని ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది.

దేవాలయాల దగ్గర ఉన్న చెట్ల కింద నివసిస్తూ, నేలపై నిద్రపోతూ, లేడి చర్మాలే వస్త్రాలుగా ధరిస్తూ, భోగాలన్నీ వదిలిపెట్టి సంచరించేటటువంటి వైరాగ్యం కలిగినా సుఖం లభించదు. కారణం ఏమిటంటే ఇంద్రియాల్ని అంతర్ముఖం చేసి సాధన చేయాలనే అభ్యాసం లేకుండా వట్టి వైరాగ్యం కలిగి ఉన్నా ఆనందం లభించదు. అభ్యాస వైరాగ్యాలనేవి ఆత్మ మార్గానికి రెండూ రెండు కళ్ళు లాంటివి. ఈ మార్గంలో మనస్సును పరబ్రహ్మమునందు లగ్నం చేయాలి. అట్లా లగ్నం చేసి ఏ విధంగా గడిపినా అంటే యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, బంధుమిత్రులతో గడిపినా ఎప్పుడూ ఆనందంతోనే ఉంటాడు. ఈ ఆత్మమార్గం ప్రపంచంలో ఉండగానే ప్రాపంచిక విషయాలకు లోనుకాకుండా ఉండేటట్లు చేస్తుంది. అదే జ్ఞాననేత్రం వల్ల లభించే ఉత్తమమైన లాభం.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: