23, సెప్టెంబర్ 2020, బుధవారం

శివామృతలహరి

     .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||


రొదగావించుచు నిర్విరామముగ నోర్పుంజూపి, పెన్గొండలన్

పిదపన్ కోనల కానలన్ గడచి యుద్వేగంబునన్ పాఱు త

న్నదికిన్ శాంతి నొసంగు సంద్రము విధానన్ సచ్చిదానంద మూ

ర్తి! దయాభ్దీ ! ననుగొంచు ముక్తి నిడరా శ్రీ సిద్దలింగేశ్వరా !


భావం;

గలగల మని శబ్దం చేస్తూ నిరంతరం ఓర్పుగా ప్రవహిస్తూ ఎత్తైన కొండలు,లోతైన కోనలు, దట్టమైన అడవులు దాటి ఉద్వేగంగా సముద్రుడి లో కలవటానికి తపన పడే నదికి, ఏ విధంగా తనలో చేర్చుకుని సముద్రుడు శాంతిని ప్రసాదిస్తాడో,

అదేవిధంగా నిరంతరం నీ నామజపం చేస్తూ, ఎంతో భక్త్యా వేశాలతో నిన్ను కలవాలని తపిస్తున్న నన్ను కూడా 

నీలో ఐక్యం చేసుకొని ముక్తిని ప్రసాదించవా! ఓ సత్యము, జ్ఞానము, ఆనందము కలిసిన

సచ్చిదానంద మూర్తి!

 ఓ దయా సముద్రుడా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

అని ప్రార్థించారు.

కామెంట్‌లు లేవు: