193వ రోజు: (స్థిర వారము) 17-06-2023
మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁజేయకు
మాచారము నిడువఁబోకుమయ్య కుమారా!
ఓ కుమారా! ఉపాధ్యాయుని ఎదిరింపవలదు. నిన్నుగాపాడిన వారిని తిట్టవద్దు. ఏదయినా ఆలోచనము చేయుటలో ఒంటరిగా జేయవద్దు. బమంచి నడవడిని వదిలిపెట్టవద్దు.
ఈ రోజు పదము.
గృహస్తుడు: అతిథేయుడు, ఇంటికాపు, గృహపతి, గృహస్థు, గృహి, యజమాని, వాస్తవ్యుడు, శ్రేష్ఠాశ్రముడు, సంసారి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి