🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 69*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*గళే రేఖా స్తిస్రో గతిగమకగీతైకనిపుణే*
*వివాహవ్యానద్ధ ప్రగుణగుణసంఖ్యా ప్రతిభువః |*
*విరాజంతే నానా విధమధురరాగాకరభువాం*
*త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవతే ||*
అమ్మా సంగీత నిధీ
గళే రేఖాస్తిస్రో = నీ కంఠమునందు మూడు రేఖలు ఉన్నాయి.
కంఠమునందు, నుదిటిపైన, నడుము నందు మూడు రేఖలు ఉండటం ఉత్తమ సాముద్రిక లక్షణమని పెద్దలు అంటారు.
నానా విధమధురరాగాకరభువాం = అన్ని విధముల మధుర రాగములకు నెలవైనది నీ కంఠము.
గతిగమకగీతైకనిపుణే = గతి, గమక, గీతములు మూడూ నాద శాస్త్రములో ప్రధానమైనవి. పాడేటప్పుడు వెలువడే మాధుర్యమునకు ఈ మూడూ మూలములు.వీటిలో అమ్మవారు నిపుణురాలు.ఈ మూడింటికీ సంకేతంగా కంఠమునందు మూడు రేఖలు కలిగివున్నది ఆమె అంటున్నారు శంకరులు.
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవ తే = గ్రామము అంటే ఒక రాగములోని సప్తస్వరములలో స్థాయిలు.
స్వరములు ..స , రి , గ , మ , ప , ద , ని
మూడింటికి ..
స - షడ్జమ
మ - మధ్యమ
గ - గాంధార వీటికి గ్రామములని పేరు.
మిగిలిన నాలుగు స్వరములు
రిషభ ,పంచమ ,దైవత , నిషాదములు.
అమ్మా ఈ మూడు గ్రామములకు సంకేతములుగాను , హద్దులుగానూ వున్నాయి నీ కంఠము నందలి మూడు రేఖలు అంటున్నారు శంకరులు.
వివాహవ్యానద్ధ ప్రతిగుణగుణసంఖ్యా ప్రతి భువః = శ్రీ లలితా సహస్ర నామములలోని *కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా* ను స్మరిస్తున్నారు. గుణము అంటే త్రాడు. మంగళసూత్రము మూడు పేటలుగా ఒకొక్క పేటకు తొమ్మిది దారాలుగా ఉంటుంది.అంటే 27. ఇది నక్షత్రముల సంఖ్య. ప్రతివారి జీవితము ,ఆయువు నక్షత్ర గమనంపై ఆధారపడి ఉంటుంది. నీ మంగళసూత్రములోని మూడు పేటలకు సంకేతంగా నీ కంఠములో ఈ మూడు రేఖలు పెట్టుకున్నావా తల్లీ అంటున్నారు శంకరులు.
శ్రీ కాంచీ మహాస్వామివారు పైఐ విధంగా వ్యాఖ్యానం చేస్తూ చమత్కారంగా మరొక మాట చెప్పారు. పరమేశ్వరుడు క్షీరసాగర మధనము నుండి జనించిన హాలాహల భక్షణము చేసేటప్పుడు ఆయన ఉదరములోని సమస్త లోకములు దహింపబడకుండా అమ్మవారు తన చేతి మూడు వ్రేళ్ళని ఆయన కంఠమునకు అడ్డు పెట్టారుట.అప్పుడు చిన్న ముద్దగా ఆయన మింగిన హాలాహలము ఆయన కంఠములో నిలిచిపోయిందట. అమ్మవారు అర్థనారీశ్వరి కనుక ఆ వ్రేళ్ళ గుర్తులు ఆమె కంఠమును అలంకరించాయిట.
అందుకే పురుషులందరికీ కంఠములో ముద్దవలెను , స్త్రీలకు కంఠమునందు త్రిరేఫములును కలిగినవని ఆయన చమత్కరించారు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి