30, అక్టోబర్ 2023, సోమవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


రూపయౌవనవతియైన అహల్య తపశ్శీలుడైన గౌతమునికి భార్య అయ్యింది. ఇంద్రుడితో

వంచనకు గురి అయ్యింది. భర్త శపించాడు. తన తప్పు తెలుసుకుంది. పశ్చాత్తాపం పొందింది. ఇలాంటి

ధర్మ విపర్యయాలు జరుగుతాయి అననురూప వివాహాలవల్ల. అందుచేత సుకన్యను ఈ చ్యవనుడికి

ఇవ్వము. మూత్రబంధన బాధను అనుభవిస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చి, మౌనంగా సాలోచనగా

విష్క్రమించి ఇంటికి చేరుకున్నాడు. మంత్రులను సమావేశపరిచాడు. ఈ ధర్మసంకట పరిస్థితిలో

మీరంతా బాగా ఆలోచించి నాకేదైనా మార్గం చూపించండి. ఏమి చెయ్యమంటారో చెప్పండి అని సలహా

అడిగాడు. అందరూ ముక్తకంఠంగా ఒకేమాట చెప్పారు. ఒక కురూపి వృద్ధతపస్వికి ఇంతటి సుందరాంగి

సుకన్యను ఇమ్మని ఎవరుమాత్రం ఎలా చెబుతారు అన్నారు. శర్యాతి ఏ దారీ దొరకక మథనపడుతున్నారు.

సుకన్యకు ఈ సంగతి తెలిసింది. చిన్నగా నవ్వుకుంది. సరాసరి తండ్రిని చేరుకుంది.

నాన్న గారూ! ఇందులో మీరు ఇంతగా మధనపడవలసిందీ దిగులుపడవలసిందీ ఏమీ లేదు. నేనిప్పుడే

వెళ్ళి ఆ మహర్షిని ఓదారుస్తాను. ప్రసన్నుణ్ణి చేసుకుంటాను. నన్ను నేను సమర్పించుకుంటాను అంది.

అమ్మా! ఏమిటి ఈ సాహసం. నువ్వు ఆ వృద్ధుడికి పరిచర్యలు చేస్తావా? అందునా ఆ

ఘోరారణ్యంలో ఒంటరిగా? అతడు అసలే క్రోధనుడు. అంధుడు. ఇవ్వి ఆలోచించావా? ఏ తండ్రి

అయినా కన్న కూతురిని అందగాడికీ యువకుడికీ ధనవంతుడికీ విద్యావంతుడికీ గుణవంతుడికీ

ఇవ్వాలనుకుంటాడేగానీ ఇలాంటి కురూపికీ వృద్ధుడికి తాపసికీ ఇవ్వాలనుకుంటాడా? కూతురు

ఇష్టపడితేమాత్రం తాను ఒప్పుకుంటాడా? నువ్వెక్కడ ఆ చ్యవనుడెక్కడ? ఏ ఒక్క అంశంలోనూ

అమరూపత లేదే. ఎలా అంగీకరించను తల్లీ! ఇది అన్యాయం. అంతఃపురసాధాలలో నివసించిన

కూతురికి అడవుల్లో పర్ణశాలల్లో నివాసం కల్పించనా? ఇంతకన్నా నేను నా సైనికులూ ఈ అనారోగ్యంతో

ఇలా మరణించడమే మంచిది. ఏది జరగాలని రాసిపెట్టిఉందో అది జరుగుతుంది. అంతే. నేను బేంబేలు

పడిపోయి చూస్తూ చూస్తూ నీకు అన్యాయం చెయ్యను, చెయ్యలేను. అమ్మా! నువ్వు స్థిరచిత్తంతో ఉండు.

ఏ అంధుడికీ నిన్ను ఇవ్వనుగాక ఇవ్వను. ఈ రాజ్యం, ఈ దేహం ఉంటే ఉండనీ, పోతే పోనీ. బాధలేదు.

ఇది నా నిర్ణయం. ఇది నా నిశ్చయం.

కామెంట్‌లు లేవు: