30, అక్టోబర్ 2023, సోమవారం

వివాహ జీవితం*

 *నూతన దంపతులు-వివాహ జీవితం*


వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడున్న తరానికి ముందు తరం వాళ్లు అయితే ఏదో రకంగా సంసార జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్దుకు పోతుండేవారు. ఈ కాలం పిల్లలు అయితే అస్సలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. వివాహ పొంతన సరిగా లేనప్పుడు గ్రహ రీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు భార్యాభర్తలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బందులు లేదా వడి దుడుకులు పూర్వం ఆడవాళ్లు అయితే భరించారు. ప్రస్తుతం వివాహ పొంతనలో దోషం ఉన్నప్పుడు గ్రహాలు ద్వారా వచ్చే ఇబ్బందులను ఆడపిల్లలు ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. వివాహ పొంతన సరిగా చూడకుండా కేవలం గణాలు లేదా పాయింట్లు 18 నుండి 36 మధ్యలో వచ్చినప్పుడు వివాహాలు చేస్తున్నారు. కేవలం ఈ గణాలు ఆధారంగా మాత్రమే కాకుండా అబ్బాయి అమ్మాయి యొక్క ఇద్దరి జాతకాలు పరిశీలించాలి. ఈ పరిశీలనలో కాబోయే భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఉంటారా ఉండరా అనే విషయం, విడిపోయేలా ఉంటే పోలీస్ కేసులు కోర్టు గొడవలు భరణాలతో విడిపోతారా లేదా ఏ గొడవ లేకుండా విడిపోతారా అనే విషయం కూడా తెలుస్తుంది. జాతకాల పరిశీలించినప్పుడు ఇది కచ్చితంగా తెలుస్తుంది. కొంతమంది వివాహ జీవితంలో మానసికంగా ఎవరో ఒకరు టార్చర్ పెడుతూ ఉంటారు, మరి కొంతమందికి రెండు వివాహాలు జరుగుతుంటాయి. కొంతమంది వివాహం తర్వాత ఆర్థికంగా బలహీన పడిపోతుంటారు. మాంగళ్య స్థానం బలహీనమైతే అతి తక్కువ కాలంలోనే ఎవరో ఒకరు కాలం చేస్తారు. ముఖ్యంగా కుజదోషం కూడా పరిశీలించాలి.9494550355. కొంతమందికి వివాహం అయిన తర్వాత సంతానం కలగదు ఇటువంటి సమస్యలు అన్ని వివాహ పొంతనలో ఇద్దరి జాతకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ విషయాలు ఏమీ పరిశీలించకుండా కేవలం 18 నుండి 36 గణాల మధ్యలో వస్తే వివాహాలు చేసేస్తున్నారు. గణాలతోపాటు పై జాతక పరిశీలన మొత్తం చేయాల్సి ఉంటుంది. వివాహం అంటే రెండు జీవితాలు మాత్రమే కాదు రెండు కుటుంబాలు రెండు తరాలకు సంబంధించిన సంతోషకరమైన బంధం వలే ఉండాలి.ఇటువంటి విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. కావున ఇద్దర జాతకాలు పరిశీలించే జ్యోతిష్యులను సంప్రదించి వివాహ సంబంధాలను నిశ్చయం చేసుకుంటే  వివాహ జీవితం బాగుంటుంది. పిల్లల జీవితానికి ఒక అర్థం ఉంటుంది. వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం చిన్న పరిహారం చేస్తే భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్యలైతే తీరిపోయి అన్యోన్యంగా ఉంటారు. పిల్లల వివాహ జీవితం కాస్త ఒడిదుడుకులుగా ఉంటే ఆమె తల్లి శివాలయంలో ఒక దీపం వెలిగిస్తూ ఉండాలి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యి , విప్ప నూనె, కొబ్బరి నూనె సమానంగా ఒక మట్టి ప్రమిదలో పోసి రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి. తన కూతురు కాపురం బాగుండాలని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేస్తూ ఉంటే దంపతుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగి వారి దాంపత్య బంధం అన్యోన్యంగా ఉంటుంది.



Forward  message

కామెంట్‌లు లేవు: