*నరసింహ శతకము*
*ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న*
*దేహ మెప్పటికి దా స్థిరత నొంద,*
*దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు*
*నొక్క తీరుననుండ దుర్విలోన,*
*బాల్య యౌవన సుదుర్భల వార్ధకములను*
*మూటిలో మునిగెడి ముఱికి కొంప ;*
*భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్న*
*గాల మృత్యువు చేత గోలుపోవు*
*నమ్మరాదయ్య ! యిది మాయనాటకంబు ;*
*జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ!*
*భూషణ వికాస ! శ్రీధర్మ పురనివాస !*
*దుష్టసంహార ! నరసింహ ! దురితదూర!*
*( 5 వ పద్యము)*
*భావము* :
*ఓ నరసింహా ! ఇహలోకము అంటే భూలోక సుఖాలు కోరుదామంటే, ఈ శరీరం నశ్వరమైనది; శాశ్వతమైనది కాదు. జీవితాంతం బలం ఒకే విధంగా వుండదు. ఈ దేహం అనే కట్టె బాల్యము, యవ్వనము, ముసలితనము అనే మురికిగుంటలో మునిగిపోయే తోలుతిత్తి. దీన్ని ప్రేమతో నిలుపుకుందామంటే* *చావు, మృత్యువులలో ఇది జారిపోతుంది. దీనిని ఎప్పటికీ నమ్మరాదు. ఇది ఒక బూటకనాటకం వంటిది. పుట్టుకనేది నాకొద్దు తండ్రీ!*
*ఓ పంకజనాభా ! నన్ను రక్షించు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి