30, అక్టోబర్ 2023, సోమవారం

మంగళవారము."* *"అట్లతదియ నోము."*

 రేపే 

*"31-10-2023, మంగళవారము."*

*"అట్లతదియ నోము."*


ఈ నోము చేసుకోవడం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం.


ఈ పండుగలో అమ్మ వారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తే కుజ దోష పరిహారమై సంసార సుఖంలో ఎలాంటి అడ్డంకులు రావని విశ్వసిస్తారు. 


కుజుడు రజోదయమునకు కారకుడు. కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుముల పిండి, బియ్యం పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. 


మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన గర్భస్రావం రాకుండా, సుఖప్రసవం అయ్యేందులు దోహదపడుతుంది. ఈ పండుగను ఉత్తర భారత దేశంలో "కర్వాఛౌత్" అనే పేరుతో జరుపుకుంటారు.


అట్లతద్ది ముందు రోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. అట్లతద్ది రోజు ఆడవాళ్ళు రోజంతా ఉపవాసం ఉంటారు. ఇంటిలో తూర్పు దిక్కున మండపం ఏర్పాటు చేసి గణపతి పూజ చేసి తర్వాత గౌరీదేవి పూజ చేస్తారు. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, గౌరీ స్తోత్రాలు, లలితా సహస్ర నామ పారాయణము చేసి పాటలు పాడతారు. 


సాయంత్రం చంద్ర దర్శనం అనంతరం తిరిగి గౌరీపూజ చేసి పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టి, పదకొండుమంది ముత్తైదువులకు అలంకారం చేసి పదకొండు అట్లు, పదకొండు పండ్లు వాయనంగా ఇస్తారు. 


అట్ల తద్ది నోము కథ చెప్పుకొని, అక్షతలు తలపై వేసుకుంటారు. ముత్తైదువులకు నల్లపూసలు, లక్క కోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాను ఇచ్చి భోజనాలు పెట్టి, తర్వాత తాము భోజనం చేస్తారు.

కామెంట్‌లు లేవు: