నాన్న అంటే ఒక భరోసా, భద్రత... అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే ..... నాన్న జీవిత కాలమంతా గుండెలో మోస్తాడు..... అమ్మకి అయినా ...... పిల్లలకి అయినా ..... నేను ఉన్నానని భరోసానిస్తూ వారి ఆశలు తీర్చడానికి యంత్రంలా పనిచేస్తాడు నాన్న.... ... కుటుంబ పెద్ద అనే ముళ్ల కిరీటాన్ని పెట్టుకుని ..... కుటుంబంలోని వారి అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వడానికి...... నిరంతరం శ్రమిస్తూ తాను కొవ్వొత్తిలా కరుగుతుంటాడు...... అమ్మ ప్రేమ కంటికి కనపడుతుంది..... నాన్న ప్రేమ గుండెలో ఉంటుంది.... నాన్న ముఖంలో కనిపించే గంభీరత్వం..... మాటలోని కఠినత్వం పిల్లలు తప్పు దారి పడకుండా ఆపుతుంది.... పిల్లల బుడిబుడి అడుగుల కింద........ తన మనసుని పరిచే నాన్న ఆ అడుగులు ఉన్నత స్థానానికి చేరేంత వరకు....... పూల దారులు ఏర్పరుస్తాడు..... ప్రతి ఆడపిల్లకు తన నాన్నే మొదటి హీరో..... బిడ్డలు బుడిబుడి అడుగులతో గుండెపై కొడితే తట్టుకునే నాన్న...... వారు పెరిగి పెద్ద అయ్యి గుండెలపై తన్నిపోతే తట్టుకోలేక తల్లడిల్లిపోతాడు.... ఈ జీవితం, నీ చదువు, నీ బ్రతుకు, నీ గుర్తింపు, నాన్న... ప్రతి బిడ్డకు కొండంత అండ నాన్న..... నాన్న కంటతడి పెట్టకుండా చూసుకోవడమే బిడ్డల బాధ్యత... నాన్న గురించి చెప్పడమంటే నీ దైవం గురించి చెప్పడమే......... నాన్నలందరికీ ఫాథర్స్ డే శుభాకాంక్షలు.....!!!.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి