యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ॥ ( 18.46)
ఏ దేవుని నుండి ఈ చరాచర సృష్టి ఉద్భవించిందో, ఏ దేవుడు ఈ చరాచర సృష్టి అంతా నిండివున్నాడో, ఆ దేవుణ్ణి తన కర్తవ్యనిర్వహణ ద్వారా మానవుడు అర్చించి, సిద్ధిని పొందుతాడు.
భగవంతుణ్ణి కర్తవ్యనిష్ఠ ద్వారా, నిస్స్వార్ధ సేవ ద్వారా అర్చించండి. అన్ని రకాల పూజల కంటే ఉత్తమోత్తమైన పూజ ఇది. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే మార్గాలుగా యజ్ఞయాగాదులను నిర్వహిస్తే, మంచిదే. ప్రారంభదశలో ఉన్న సాధకులకు ఇవన్నీ అవసరమే. కానీ ఇంత కంటే ఉన్నతమైన పూజా విధానాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఈ ఉన్నతమైన విధానాలను చేపట్టి, తద్వారా సాధకుడు పరమేశ్వరునికి చేరువ కావాలి. ఉన్నతమైన పూజా విధానాలను అనుసరించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు తక్కువ స్థాయి పూజలను ఎందుకు చేయాలి?
లోకంలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి